ఈ జన్మలో ఉలుకూ పలుకూ లేవు, మతం మారితే వచ్చే జన్మలోనైనా మామూలుగా పుడతావు అంటూ ప్రలోభపెట్టి, మూగ చెవిటి అమ్మాయిని మతం మార్చేందుకు ప్రయత్నం చేసిందొక క్రైస్తవ ముఠా. అదృష్టవశాత్తు ఆమె తల్లిదండ్రులు వెంటనే ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెను, తనతో పాటు మరో ఇద్దరిని రక్షించగలిగారు.
సురభి మెహతా రాజస్థాన్లోని కోట జిల్లాకు చెందిన 23ఏళ్ళ మూగ, చెవిటి యువతి. ‘జెహోవా విట్నెసెస్’ అనే గ్రూపు ఆమెను ఆకట్టుకుంది. యువతిని మభ్యపెట్టి మతం మార్చడానికి వారు ఆమెను ఇండోర్ నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళారు. విషయం తెలిసిన తల్లిదండ్రులు భిల్వారా పోలీసులకు ఫిర్యాదు చేసారు. సకాలంలో స్పందించిన పోలీసులు సురభితో పాటు మరో ఇద్దరు అమ్మాయిలను కూడా కాపాడారు.
బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పిన వివరాల ప్రకారం, సురభికి జెహోవాస్ విట్నెస్ సంస్థతో జైపూర్లో పరిచయం ఏర్పడింది. ఆమె వైకల్యాన్ని అడ్డుపెట్టుకుని ఆమెను మతం మార్చడానికి ఆ సంస్థ ప్రతినిధులు ప్రయత్నించారు. సురభి ఇప్పుడు క్రైస్తవంలోకి మతం మారితే వచ్చే జన్మలో ఆమెకు మాట, వినికిడి జ్ఞానం రెండూ ఉంటాయని, పరిపూర్ణ ఆరోగ్యవతిగా ఉంటుందనీ నమ్మబలికారు.
నవంబర్ 19న సురభి తన కుటుంబ సభ్యులకు ఏమీ చెప్పకుండా ఇండోర్ నుంచి బయల్దేరిపోయింది. తల్లిదండ్రులు ఇంటికి తిరిగిరాని కుమార్తె గురించి వాకబు చేసినప్పుడు, జెహోవా విట్నెసెస్ సంస్థ నిర్వహించే సమావేశం కోసం వెళ్ళినట్లు తెలిసింది. ఆ సంస్థ ఆమెను ఇండోర్ నుంచి ఢిల్లీ తీసుకునిపోయి, అక్కడ మతం మార్చాలని పన్నాగం పన్నారని సురభి తల్లిదండ్రులు ఆరోపించారు.
సురభి తల్లిదండ్రులు తమ కుమార్తె తప్పిపోయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ఆమె ఆచూకీ కనుగొన్నారు. ఇండోర్-ఢిల్లీ ఎక్స్ప్రెస్ రైలు భిల్వారా స్టేషన్కు చేరుకున్నప్పటికి ఆమెను పోలీసులు గుర్తించారు. అక్కడ ఆమెతో పాటు మరో ఇద్దరు యువతులను కూడా రక్షించారు. వారిగురించి కనీస వివరాలు అడిగి తెలుసుకుని పంపించేసారు. కేసు విచారణ జరుగుతోంది.