లష్కరే తోయిబాకు చెందిన కడురుగట్టిన ఉగ్రవాది సల్మాన్ రెహ్మాన్ ఖాన్‌ను ఎట్టకేలకు భారత్‌కు రప్పించారు. బెంగళూరు జైళ్లపై బాంబుల దాడికి ఆయుధాలు సమకూర్చిన సల్మాన్ రెహ్మాన్ ఖాన్ విదేశాలకు పారిపోయాడు. అతనిపై జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌కు సమాచారం అందించింది. రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
సల్మాన్ రెహ్మాన్ ఖాన్ కదలికలపై పలు దేశాల పోలీసులు నిఘా ఉంచారు. ఇటీవల రెహ్మాన్ ఖాన్ రువాండాలో పోలీసులకు పట్టుబడ్డారు. అప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఉండటంతో భారత్‌కు అప్పగించారు. రెహ్మాన్ ఖాన్ రువాండా నుంచి ఢిల్లీకి తరలించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.
రువాండాలోని కిగాలీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా రెహ్మాన్ ఖాన్ ఆయుధాలతో దొరికిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే రువాండా పోలీసులకు భారత నిఘా వర్గాలకు సమాచారం అందించాయి. రువాండాతో భారత్‌కు నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉండటంతో రెహ్మాన్ ఖాన్‌ను ఢిల్లీకి తరలించారు.