ఆంధ్రప్రదేశ్ లోని మరిన్ని ఆలయాలకు ధూప, దీప నైవేద్యం కింద నిధులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఇప్పటికే ఆలయాలకు ఇస్తున్న నిధులను రెన్యూవల్ చేశామని తెలిపిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,రాష్ట్రంలో ప్రస్తుతం 5,400 ఆలయాలకు ప్రభుత్వం నుంచి సాయం అందజేస్తున్నామని వెల్లడించారు. ధూప,దీప నైవేద్యాలకు గతంలో రూ. 5వేలు ఇస్తే ప్రస్తుతం దానిని రూ. 10 వేలకు పెంచి ఇస్తున్నామన్నారు.
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, తిరుమలలో మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వారిని శాలువలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుమలలో నాలుగు మాసాల్లోనే చాలా మార్పు వచ్చిందన్న ఆనం రామనారాయణ రెడ్డి, సామాన్య భక్తులకు స్వామి దర్శనంలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు వివరించారు.