అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష నిర్వహించారు. విశాఖపట్నంలోని నేవల్ డాగ్ యార్డులో ఈ జలాంతర్గామిని తయారు చేశారు. క్షిపణి ప్రయోగం కూడా విశాఖ నుంచే నిర్వహించారు. కే4 క్షిపణి 3500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.ప్రయోగ ఫలితాలను విశ్లేషిస్తున్నారు.
ఐఎన్ఎస్ అరిఘాత్ అణు జలాంతర్గామిని రెండు నెలల కిందట రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. 2011లో అరిఘాత్ జలాంతర్గామి తయారీని ప్రారంభించారు. 2018 నాటికే తొలదశ పూర్తి చేసి జలప్రవేశం చేయించారు. ఆ తరవాత రాడార్ వ్యవస్థకు అనుంధానం చేశారు.తాజా ప్రయోగంతో భారత్ అణు జలాంతర్గాముల నుంచి ఖండాంతర క్షిపణులు ప్రయోగంచే ఆరు దేశాల జాబితాలో చేరింది. అమెరికా, చైనా,బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా దేశాలు అణుజలాంతర్గాములను నిర్మించాయి.
చైనా లక్ష్యంగా భారత్ ఈ ప్రయోగం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే కే15, కే4 క్షిపణులను కూడా భారత్ తయారు చేసింది. ఇవి 3500 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.