ఢిల్లీలోని బిజ్వాసన్ ప్రాంతంలో ఈడీ అధికారులపై కొందరు గుర్తుతెలియని దుండగులు ఫర్నిచర్‌తో దాడికి దిగారు.ఈడీలోని హై ఇంటెన్సివ్ యూనిట్ అధికారులు ఢిల్లీలోని ఓ ఫామ్ హౌసులో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో దాడి చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ క్రైం నెట్‌వర్క్‌ను గుర్తించే క్రమంలో ఓ చార్టెడ్ అకౌంటెన్సీ సంస్థపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించే క్రమంలో ఈ దాడులు జరిగాయి.
దుండగుల దాడిలో ఈడీ అదనపు డైరెక్టర్ ఒకరికి గాయాలయ్యాయి. దాడికి దిగిన దుండగులు పరారీలో ఉన్నారు. ఈడీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.
దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ దోపిడీలో కాజేసిన వారిని పట్టుకునేందుకు ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. ఫిషింగ్, ఉద్యోగాల పేరుతో వల విసరడం, క్యూ ఆర్ కోడ్, ఓపీటీ, డిజిటల్ అరెస్ట్ ఇలా రకరకాల సైబర్ నేరాలకు పాల్పడి, విదేశాలకు డబ్బు తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. సోదాల సమయంలో ఈ దాడి జరిగింది.