నాగాలాండ్ లో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కిఫిర్ లో గురువారం ఉదయం 7:22 గంటలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 3.8గా నమోదైంది.
కిఫిర్ ప్రాంతం చుట్టూ భూమికి 65 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమై ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూ ప్రకంపనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. కొన్ని భవనాలు ఊగడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. కేకలు వేస్తూ నివాసాల నుంచి బయటకు పరిగెత్తారు.