అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో పెను ప్రమాదం జరిగింది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీకై ఇద్దరు కార్మికులు చనిపోయాడు. మరో పది మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించారు. ఫార్మా కర్మాగారంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
బుధవారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు 3వ నెంబరు బాయిలర్లో రెండు రసాయనాలను వేడి చేశారు. అక్కడ తీవ్రమైన విషవాయువులు లీకయ్యాయి. ఈ విషయం కంపెనీ రహస్యంగా ఉంచింది. ఇంటికి వెళ్లిన కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒడిషాకు చెందిన అమిత్ బాగ్ ఇంటి వద్దే చనిపోయాడు. పది మంది కార్మికులు దగ్గు, కళ్లుమంటలు, మత్తు, కళ్లు తిరగడం, శ్వాసపీల్చుకోవడం కష్టంగా మారడంతో వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు.
కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు, పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్, మంత్రులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కార్మికులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
ప్రమాద కారణాలపై విచారణకు ఆదేశించారు. ఆసుపత్రుల్లో ఉన్న వారికి ఉచితంగా చికిత్స అందించే ఏర్పాట్లు చేశారు. మంత్రులు, కలెక్టర్ స్వయంగా పర్యవేక్షణ చేయాలని సీఎం ఆదేశించారు.