ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలోని హుండీ కానుకలు లెక్కించారు. కనకదుర్గమ్మ, మల్లేస్వారస్వామిని దర్శించుకుంటున్న భక్తులు, పెద్దఎత్తున కానుకలు సమర్పిస్తున్నారు. నగదుతో పాటు బంగారు, వెండి ఆభరణలు మొక్కుగా చెల్లిస్తున్నారు. ఆలయంలో బుధవారం హుండీ కానుకలు లెక్కించారు.
హుండీ లెక్కింపు లో భాగంగా భక్తులు రూ. 3,80,77 ,021 నగదు సమర్పించారని తెలిపారు. బంగారం 559 గ్రాములు,వెండి 7 కేజీల 20 గ్రాములు సమర్పించుకున్నారు.
విదేశీ కరెన్సీ కి సంబంధించి యుఎస్ఏ 615 డాలర్లు, ఆస్ట్రేలియా 55 డాలర్లు, కువైట్ 7 దినార్లు, క్వతార్ 27 రియాల్స్, యూఏఈ 110 దిర్హమ్స్, మలేషియా 33 రింగేట్లు, సౌదీ 19 రియాల్స్, ఇంగ్లాండ్ 30 పౌండ్లు, యూరప్ 10 యూరోలు, కెనడా 25 డాలర్లు, ఒమాన్ 0.5 రియాల్, సింగపూర్ 10 డాలర్లు భక్తులు కానుకుగా సమర్పించారు.
హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ఈవో కె ఎస్ రామరావు, డీప్యూటీ ఈవో ఎమ్.రత్న రాజు, దేవాదాయ శాఖ అధికారులు, ఏ ఈ ఓ లు, ఆలయ సిబ్బంది, ఎస్పీఎఫ్ I-టౌన్ పోలీసు సిబ్బంది, అమ్మవారి సేవా దారులు పాల్గొన్నారు.