పాలస్తీనాలో ముస్లింలపై ఏదైనా జరిగితే స్పందించే మేధావులు, వామపక్షాల నేతలూ బంగ్లాదేశ్‌లో హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ప్రధానితో భేటీ అనంతరం దేశ రాజధానిలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆ వ్యాఖ్యలు చేసారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింస తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. బంగ్లాదేశ్ ఏర్పడిందే భారత సైన్యం త్యాగాలతో అని గుర్తుచేసారు.
భారతదేశంలో మైనారిటీలను ఎలా చూస్తున్నాం? బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులను ఎలా చూస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. అదానీ సోలార్ ప్రాజెక్ట్ కోసం గత జగన్ ప్రభుత్వ హయాంలో లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణల మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిశితంగా అధ్యయనం చేస్తున్నారని పవన్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేక అవకతవకలకు పాల్పడిందని మండిపడ్డారు. ముఖ్యంగా జగన్ హయాంలో ఎర్రచందనం అక్రమ రవాణా భారీ స్థాయిలో జరిగిందని ఆరోపించారు.
మూడురోజుల ఢిల్లీ పర్యటనలో పవన్ ఉపరాష్ట్రపతి, మరికొందరు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్ర సమస్యలపై చర్చించినట్టు వెల్లడించారు. ఈ సాయంత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్‌తో భేటీ అయిన పవన్, వారాహి డిక్లరేషన్ ప్రతిని ఆయనకు అందించారు.