Tuesday, July 8, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home జాతీయ

ఎస్సీ రిజర్వేషన్ కోసం క్రైస్తవ మహిళ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం, ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే’ అని వ్యాఖ్య

Phaneendra by Phaneendra
Nov 27, 2024, 05:34 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

బాప్టిజం తీసుకున్న క్రైస్తవురాలైన ఒక మహిళ హిందువునని చెప్పుకుంటూ తనకు ఉద్యోగంలో ఎస్సీ రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తింపజేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఆ అప్పీలును సుప్రీంకోర్టు ఇవాళ తిరస్కరించింది. అటువంటి పని ‘రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ఆ మహిళ అప్పీలును డిస్మిస్ చేసింది. నిజమైన ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తిస్తాయని, మతం మారితే ఆ ప్రయోజనాలకు వర్తించవనీ స్పష్టం చేసింది. మతం మారి కూడా రిజర్వేషన్ లబ్ధి పొందడానికి ప్రయత్నించడం రాజ్యాంగపు మౌలిక లక్ష్యాల్లో ఒకటైన సామాజిక న్యాయానికి విఘాతం కలిగిస్తుందని ఘాటుగా స్పందించింది.

తమిళనాడుకు చెందిన సి సెల్వరాణి పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో యుడిసిగా పనిచేస్తోంది. తను తమిళనాడులో షెడ్యూల్డు కులాలలో ఒకటైన వల్లువన్ కులానికి చెందినదానినని, అందువల్ల తనకు ఎస్‌సి రిజర్వేషన్ ప్రయోజనాలు కలిగించాలనీ ఆమె కోరింది. అయితే రాష్ట్రప్రభుత్వ విచారణలో ఆమె క్రైస్తవ కుటుంబంలో పుట్టిన విషయం వెల్లడైంది. ఆమె తండ్రి హిందూమతం నుంచి క్రైస్తవంలోకి మతం మారాడు. సెల్వరాణి 1991లో పుట్టిన కొన్నాళ్ళకే ఆమెకు బాప్టిజం కూడా ఇచ్చారు.

సెల్వరాణి తండ్రికి, సోదరుడికీ ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి. సెల్వరాణి కూడా తను వల్లువన్ అనే ఎస్సీ కులానికి చెందిన దాన్నని చెప్పుకుంది. తద్వారా ప్రభుత్వోద్యోగాల్లో ఎస్సీ కులాలకు ఇచ్చే లబ్ధిని పొందాలి అనుకుంది. అయితే వెరిఫికేషన్ ప్రక్రియలో ఆమె పుట్టినప్పటినుంచే బాప్తిజం పొందిన క్రైస్తవురాలు అన్న విషయం బైటపడింది. సెల్వరాణి పెళ్ళి కూడా క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం రిజిస్టర్ అయింది. ఎస్సీ రిజర్వేషన్ లబ్ధి కావాలనుకున్న సెల్వరాణి, తను మళ్ళీ హిందూమతంలోకి మారిపోయానని చెప్పుకుంది. అయితే దాన్ని ధ్రువీకరించే ఆధారాలేమీ లేవు. దాంతో తమిళనాడు ప్రభుత్వం ఆమెకు ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సెల్వరాణి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని నిర్ధారించింది. హిందూమతం విడిచి క్రైస్తవం లేదా మరే ఇతర మతంలోకి అయినా మారితే హిందూమతంలోని కులం పోతుందని, ఆ కులం ఆధారంగా వచ్చే రిజర్వేషన్ దక్కదనీ స్పష్టం చేసింది. ఎస్సీ రిజర్వేషన్ కావాలంటే మళ్ళీ హిందూమతంలోకి మారాలనీ, ఆ మేరకు స్పష్టమైన ఆధారాలు ఉండాలనీ కూడా చెప్పింది.

మద్రాస్ హైకోర్టు తీర్పుతో నిరాశ చెందిన సెల్వరాణి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దానిమీదనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సెల్వరాణి అప్పీలును డిస్మిస్ చేస్తూ సమగ్రమైన, సవివరమైన తీర్పు ప్రకటించింది. జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం చాలా స్పష్టంగా తమ తీర్పును ప్రకటించింది. ‘‘దరఖాస్తుదారురాలు క్రైస్తవురాలు అయినప్పటికీ కేవలం ఉద్యోగంలో రిజర్వేషన్ కోసమే హిందువుగా ఉన్నట్లు చెప్పుకుంటోంది. అటువంటి వ్యక్తికి ఎస్సీ హోదా ఇవ్వడం రిజర్వేషన్ల మౌలిక స్ఫూర్తికే విరుద్ధం, అలాంటి చర్య రాజ్యాంగాన్ని మోసం చేయడమే అవుతుంది’’ అని స్పష్టం చేసింది.

Tags: andhra today newsChristian WomanFraud on ConstitutionPetition for SC ReservationSLIDERSupreme CourtTOP NEWS
ShareTweetSendShare

Related News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ
general

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి
general

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు
general

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ
general

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం
general

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

Latest News

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

పర్యాటక రంగంలో మేలి మలుపు అఖండ గోదావరి ప్రాజెక్ట్

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

దేశీయ ఉత్పాదక రంగాన్ని కొత్త యెత్తులకు తీసుకెళ్ళిన ‘మేక్ ఇన్ ఇండియా’

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.