మహారాష్ట్ర సీఎం పదవిపై ఉత్కంఠ వీడింది. సీఎం పదవికి ఎవరిని ఎంపిక చేసినా ఫర్వాలేదని శివసేన చీఫ్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ శిందే ప్రకటించారు. తాను ఏనాడూ పేరు కోసం పాకులాడలేదన్న ఏక్ నాథ్ శిందే, బాల్ థాక్రే ఆశయాలను ముందుకు తీసుకెళ్తానన్నారు.
థానేలోని మీడియాతో మాట్లాడిన ఏక్ నాథ్ శిందే, మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. సీఎం అంటే కామన్ మ్యాన్ అని అభివర్ణించిన ఏక్ నాథ్ శిందే, మహారాట్ర అభివృద్ధే తనకు ముఖ్యమన్నారు. మోదీ మద్దతు తనకు ఉందన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పీఎం మోదీ మాటకు కట్టుబడి ఉంటనంటూ సీఎం పదవిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించారు.