ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమైన పవన్ , జలజీవన్ మిషన్ కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితి పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు.
దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్ తో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పవన్ను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కలిశారు.
బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకులు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును పవన్ కళ్యాణ్ సోషల్ మీడియావేదికగా ఖండించారు. హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులను కలిసికట్టుగా ఎదుర్కొందామని ట్విటర్ ద్వారా పిలుపునిచ్చారు. పాకిస్తాన్లో దాడులు జరిగితే హైదరాబాద్ పాతబస్తీలో లేచి మాట్లాడుతారన్నారు. మరి పక్క దేశం బంగ్లాదేశ్లో ఊచకోత జరిగితే భారతదేశం సమాజం స్పందించక పోవడం ఆందోళనకు గురిచేస్తుందన్నారు.