తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విశ్వహిందూ పరిషత్
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో అపచారం జరిగింది. పతినెట్టంపడి బంగారు మెట్లపై స్థానికంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు ఫోటోషూట్ చేశారు. దీనిపై అయ్యప్ప భక్తులతో పాటు విశ్వహిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ప్రవర్తన అమర్యాదపూర్వకంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయ్యప్ప స్వామి విగ్రహం వైపు ఏ భక్తుడు కూడా తన వెన్ను చూపరని , ఆలయ ప్రధాన పూజారి కూడా విగ్రహాన్ని చూస్తూనే ఆ మెట్లు దిగుతారని వీహెచ్పీ పేర్కొంది. అలాంటిది, స్వామి వారి పవిత్ర 18 బంగారు మెట్లపై ఫోటో ఎలా దిగుతారని ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదంపై స్పందించిన కేరళపోలీసు ఉన్నతాధికారులు సమగ్ర నివేదిక అందజేయాలని ఎస్పీని కోరారు. డ్యూటీముగించుకుని వెళుతున్న తొలి బ్యాచ్ సిబ్బంది మెట్లపై గ్రూపు ఫోటో దిగినట్లుగా ప్రాథమికంగా తేలింది.