ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి వరకు అన్నప్రసాదం
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ముక్కోటి ఏకాదశి ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. జనవరి 10 నుంచి 19 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అడిషనల్ ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సాధారణ భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. టీటీడీ, పూల అలంకరణలు, వసతి, శ్రీవారి సేవకులు, స్కౌట్ల నియామకం పై అధికారులకు అదనపు ఈవో సూచనలు చేశారు.
వైకుంఠ ద్వార దర్శనాు జరిగే పది రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయడంతో పాటు చంటి బిడ్డలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐ దర్శనాలు రద్దు చేయనున్నారు. జనవరి 10న స్వర్ణ రధం ఊరేగింపు, 11న చక్ర స్నానం నిర్వహించనున్నారు.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 10 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్న ప్రసాదం అందజేయనున్నారు. సీవీఎస్వో శ్రీధర్, సీఈ సత్య నారాయణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.