ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఒక మైనర్ హిందూ బాలికపై ముస్లిం ఉపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమెను కళాశాలలో చేర్చి, తనను పెళ్ళి చేసుకోవాలంటూ ఒత్తిడి చేయసాగాడు. ఇస్లాంలోకి మతం మారాలంటూ ఒత్తిడి చేయడమే కాదు, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లక్ష రూపాయలు ఇస్తానని ప్రలోభపెట్టాడు. తనను పెళ్ళి చేసుకోకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేసేస్తానంటూ బెదిరించాడు. పోలీసులు నిందితుణ్ణి కస్టడీలోకి తీసుకున్నారు.
అమ్రోహా జిల్లాలోని మండీ ధనోరా ప్రాంతంలోని రాష్ట్రీయ ఇంటర్ కాలేజ్‌లో మొహమ్మద్ షహీద్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. తొమ్మిదో తరగతికి గణితం బోధించే మొహమ్మద్ షహీద్, ఒక మైనర్ హిందూ బాలికను తను పనిచేసే కళాశాలలో చేర్చాడు. వయసులో తనకంటె చాలా చిన్నదైన ఆ చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత తనతో నిఖా చేసుకోవాలని ఒత్తిడి చేయసాగాడు.
మొహమ్మద్ షహీద్ చర్యల గురించి ఆ బాలిక తన తల్లిదండ్రులకు చెప్పుకుంది. వారు వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసారు. కానీ ప్రిన్సిపాల్ ఏ చర్యా తీసుకోలేదు. కొన్ని రోజుల తర్వాత షహీద్, ఆ అమ్మాయి తరగతి గదికి వెళ్ళి అక్కడే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనను పెళ్ళి చేసుకుంటే రూ.లక్ష ఇస్తానని ప్రలోభపెట్టాడు. అంతేకాదు, తనతో నిఖాకు ఒప్పుకోకపోతే ఆమెను పరీక్షల్లో ఫెయిల్ చేసేస్తానంటూ బెదిరించాడు కూడా.
ఆ బెదిరింపులతో భయభ్రాంతురాలైపోయిన హిందూ మైనర్ బాలిక, మళ్ళీ తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కళాశాల ముందు నిరసన ప్రదర్శన కూడా చేపట్టారు. దాంతో అప్రమత్తమైన నిందితుడు మొహమ్మద్ షహీద్, కళాశాల నుంచి పారిపోడానికి ప్రయత్నించాడు.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థల కార్యకర్తలు విషయం తెలిసిన వెంటనే కళాశాల దగ్గరకు వెళ్ళారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ కళాశాల యాజమాన్యాన్ని, పోలీసులను డిమాండ్ చేసారు.
పోలీసులు రంగంలోకి దిగి నిందితుడు మొహమ్మద్ షహీద్‌ను అరెస్ట్ చేసారు. పోక్సో సహా సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసారు. కేసు దర్యాప్తు మొదలైంది. మరోవైపు కళాశాల యాజమాన్యం నిందితుణ్ణి సస్పెండ్ చేసింది.