26 నవంబర్ 2008 న దేశం… కాదు కాదు… ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది.
కారణం? భారత ఆర్ధిక రాజధాని ముంబై మహానగరంలో కొద్దిసమయం తేడాలో ఎనిమిది చోట్ల వరుస బాంబు పేలుళ్లు. ఈ రోజుకి ఆ దురదృష్టమైన భీకర సంఘటన జరిగి 16 సంవత్సరాలు అయింది.
1. ఛత్రపతి శివాజీ టెర్మినస్ 2. ఒబేరాయ్ ట్రైడెంట్ 3. తాజ్ హోటల్ 4. లియోపోల్డ్ కేఫ్ 5. కామా హాస్పిటల్
6. యూదుల ప్రార్ధనా మందిరం గల నారిమన్ హౌస్ 7. మెట్రో సినిమా హాల్ 8. టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక వీధిలో.
అవి కాక చిన్న చిన్న పేలుళ్లు –
1. సెయింట్ జేవియర్ కాలేజి 2. మజగావ్ పోర్ట్ దగ్గర 3. విలే పార్లే వద్ద ఒక టాక్సీలోనూ జరిగాయి.
ఆ దాడుల్లో 170 మంది వరకు చనిపోగా 300 మందికి పైగా గాయపడ్డారు.
పాకిస్తాన్ నుండి లష్కరే టెర్రరిస్టులు పది మంది సముద్రం గుండా ముంబై లో చొరబడి విధ్వంసం సృష్టించారు.
దేశంలో టెర్రరిస్టు దాడులకు హిందువులే కారణం అని నిరూపించడానికి కాంగ్రెస్-కొందరు అధికారులు-పాక్ కలిసి చేసిన దారుణమైన కుట్ర ఇదా?
2004 -14 యుపిఎ కాలంలో దేశంలో బాంబు దాడులకు గురి కాని ఒక్క పెద్ద నగరం కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని పెద్ద నగరాల్లో అంటే ముంబై ఢిల్లీ బెంగుళూరు హైదరాబాద్ వంటి పట్టణాల్లో అయితే రెండు మూడు పెద్ద బాంబు పేలుడు సంఘటనలు కూడా జరిగాయి. కొన్ని వందల మంది చనిపోగా కొన్ని వందల మంది శాశ్వత వికలాంగులుగా మిగిలిపోయారు.
మరి 2014 నుండి ఈ 10 ఏళ్ళలో కూడా అదే పోలీస్, అదే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. అయినా, దేశం నడిబొడ్డున ఉన్న పెద్ద నగరాల్లో పెద్ద బాంబుదాడులు ఎందుకు జరగలేదు?
కారణం..?
ప్రస్తుత మోడీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి రాజకీయ జోక్యం లేకుండా చేసింది. గతంలో యుపిఎ ప్రభుత్వం టైమ్ లో ఇంటెలిజెన్స్ వారికి ఏదైనా ముందస్తు సమాచారం వస్తే దానిని ఆధారం చేసుకుని అరెస్టులు చేస్తే మైనార్టీ ఓట్లు పోతాయనే కక్కుర్తితో కాంగ్రెస్ నాయకులు ఆ అరెస్టులను అడ్డుకోవడమో లేక అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టడమో చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు రాజకీయ జోక్యం లేకపోవడంతో సెక్యూరిటీ అధికారులు అనుమానితులను అరెస్టు చేస్తూ వారి ద్వారా మరింత సమాచారం సేకరిస్తూ మరిన్ని అరెస్టులు చేస్తూ అప్రమత్తంగా ఉంటూ దాడులు చేద్దామనుకునే వారిలో పట్టుబడిపోతామేమో అన్న భయం ముందే కలుగచేస్తూ దాడులు జరగకుండా ప్రజలను రక్షిస్తున్నారు.
పాక్ మీద సర్జికల్ దాడులు చేసి గతంలో లాగా బాంబు దాడులు భారత్ లో జరిగితే మన దేశం మీద భారత్ దాడి చేస్తుందేమో అన్న భయం పాక్ సైన్యంలో మరియు రాజకీయనాయకులలో కూడా కలిగించారు.
అందుకే దేశంలో బాంబు దాడులు తగ్గాయి.
ఇంత పెద్ద దేశంలో అంతర్గత భద్రతా వ్యవస్థ నిర్వహించడం చాలా కష్టమైన పని. ఇంక ఆ వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉంటే ప్రజల ప్రాణాలు గాల్లోనే.
సరిగ్గా సోనియా గాంధీ యుపిఎ ప్రభుత్వంలో జరిగింది అదే. అందుకే యూపీఏ టైం లో అన్ని బాంబుదాడులు. నేను ఇది ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణ కాదు. యూపీఏ ప్రభుత్వంలో హోంశాఖలో ఉన్నత పదవిలో పనిచేసిన RVS మణి చేసిన భయంకరమైన ఆరోపణ. ఆయన యూపీఏ ప్రభుత్వం ఉండగానే 2009 లో ఒక సంచలనమైన ఆరోపణ చేశారు. అదేమిటంటే నాందేడ్ బాంబు దాడుల తరువాత సెక్యురిటీ విషయాల మీద ఒక మీటింగ్ జరిగింది. దానిలో అప్పటి హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్, దిగ్విజయ్ సింగ్, హేమంత్ కర్కరే మొదలైన వారు ఉన్నారట. సంఝౌతా, మాలేగావ్, మక్కా మసీదు మొదలైన, దేశంలో జరుగుతున్న పెద్ద పెద్ద బాంబు దాడుల వెనుక ఈ దేశంలోనే ఉండి పాక్ సహాయం పొందుతున్న ఇస్లామిక్ తీవ్రవాదుల మాడ్యూల్స్ ఉన్నాయి అని మణి ఆ సమావేశంలో చెప్పారుట. కానీ వారిమీద చర్యలు తీసుకోడం యూపీఏకు రాజకీయంగా ఇబ్బంది కావడంతో ఆ దాడులను హిందూ లేదా కాషాయ (saffron terror) దాడులుగా చూపించమని హోమ్ మినిస్ట్రీ అధికారులపై వత్తిడి తెచ్చేరట. అది చెయ్యడానికి మణి గారు ఒప్పుకోకపోవడంతో ఆయనకు చాలా ఇబ్బందులు సృష్టించారట. అంతేకాక ఇంటెలిజెన్స్ వాళ్ళు ముందస్తు సమాచారంపై అనుమానిత ఇస్లామిక్ తీవ్రవాదులను అరెస్టు చేసేటప్పుడు అడ్డుపడడం లేదా అప్పుడప్పుడు అరెస్ట్ చేసిన వారిని విడిపెట్టమని రాజకీయ ఒత్తిడులు తెచ్చేవారట. అప్పట్లో యుపిఎ నేతలు అందరూ హిందూ టెర్రర్, సాఫ్రాన్ టెర్రర్ పదాలు విపరీతంగా ఉపయోగించేవారు. అప్పట్లో ఒక పద్ధతి ప్రకారం హిందూ టెర్రర్ అనే పదం సృష్టించారు, ప్రచారం కల్పించారు అని మణి చెప్పారు.
అంతే కాదు అజ్మేర్ దర్గా, మక్కా మసీదు, సంఝౌతా రైలు పేలుళ్ళ కేసులో సిబిఇ కొందరు ఇస్లామిక్ తీవ్ర వాదులను అరెస్ట్ చేస్తే, NIA రంగంలోకి దిగి, CBI అరెస్ట్ చేసిన వారు కాదని చెప్పి… స్వామి ఆసీమానంద, సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్‌లను అరెస్ట్ చేశారు.
అంతే కాదు యుపిఎ హయాంలో కేంద్ర కేబినెట్‌కి సలహాలిచ్చే నెపంతో రాజ్యాంగంలో ఎక్కడా లేని ఒక రాజ్యాంగేతర శక్తి NAC అంటే నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్‌ని సోనియాగాంధీ అధ్యక్షతన తయారు చేసి దానిలో కరుడు గట్టిన వామపక్ష సానుభూతి పరులు అరుణా రాయ్, హర్ష మందేర్, యోగేంద్ర యాదవ్ వంటి వారితో నింపేసారు. ఆ అరుణా రాయ్, హర్ష మందేర్ అయితే ముంబై దాడులు చేసిన కసబ్‌కి క్షమాభిక్ష పెట్టాలి అని కూడా ఉద్యమం నడిపారు.
ఒకసారి ఆ విషయాలు అన్నీ పరిశీలిస్తే రాజకీయాల కోసం దేశం ఎంత ప్రమాదంలోకి నెట్టబడిందో తెలుస్తుంది.
26/11 దాడులు సముద్రం ద్వారా వచ్చే టెర్రరిస్టుల ద్వారా 5స్టార్ హోటల్ వద్ద జరగబోతున్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ CIA ముందుగానే భారత్‌కు సమాచారం ఇచ్చింది. కానీ యుపిఎ దానిపై స్పందించలేదు. పైగా ఆ దాడులు జరిగాక వాటిని “కాషాయ ఉగ్రవాదుల దాడులుగా” నిరూపించడానికి ప్రయత్నాలు జరిగాయి.
ఎలా అంటే….
1. ఈ దాడుల ముఖ్య సూత్రధారి కసబ్ తన చేతికి కాషాయరంగు తాళ్లు కట్టుకున్నాడు
2. దాడుల తరువాత దిగ్విజయ్ సింగ్, మహేష్ భట్ ’26/11 దాడులు వెనుక RSS హస్తం’ అన్న పుస్తకం విడుదల చేసారు.
3.రాహుల్ గాంధీ ఒక మెట్టు పై కెక్కి మా దేశానికి లష్కరే కన్నా హిందూ తీవ్రవాదం ప్రమాదం అని అమెరికా రాయబారితో చెప్పాడు
4. హేమంత్ కర్కరే ని చంపింది ఎవరో బయటపెట్టలేదు
5. 26/11 దాడుల ముందు రోజుల నుండి భారత్ ఉన్నత రక్షణ అధికారులు అందరూ అధికారిక పర్యటన మీద పాక్ వెళ్లి ఇక్కడ దాడులు జరిగే సమయానికి అక్కడ వీరు విందులు ఆరగిస్తున్నారు. ఎవరి అనుమతితో ఒకేసారి అంత మంది ముఖ్య ఆఫీసర్లు పాక్ వెళ్లారు?
6. ముంబయ్ దాడులకు పాల్పడిన టెర్రరిస్టుల బోట్‌పై నేవల్ అధికారుల నిఘా వద్దు అని ఆదేశాలు వచ్చాయి, అందుకే వారు తనిఖీ చెయ్యలేదు అని చిదంబరం పార్లమెంట్లో చెప్పారు. ఎవరు ఆ ఆదేశాలు ఇచ్చింది అనేది చెప్పలేదు.
7. అంత పెద్ద ఎత్తున దాడులు జరిగిన వెంటనే హోంమంత్రి నెషనల్ సెక్యురిటి గార్డ్స్ కి టెర్రరిస్టులను పట్టుకునే బాధ్యత అప్పగించడానికి ఎందుకు అంత ఆలస్యం చేశారు?
8. మహేష్ భట్ కొడుకు టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీకి సహాయం చేసాడు అని రుజువు అయినా అతని మీద విచారణ ఎందుకు చెయ్యలేదు?
9. ఈ ముంబై దాడులు జరగ వచ్చు అని హింట్ ఇచ్చిన ఆర్మ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కల్నల్ పురోహిత్ మీద తప్పుడు కేస్ పెట్టి జైల్లో చిత్ర హింసలు ఎందుకు పెట్టారు?
అంతేకాదు, ఇస్లామిక్ తీవ్రవాదులు మీద విపరీతమైన సానుభూతి చూపించింది UPA సోనియాగాంధీ ప్రభుత్వం.
* లష్కరే టెర్రరిస్ట్ మాడ్యూల్ ఇష్రత్ జహాన్ సహా ముగ్గురు టెర్రరిస్టులను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్కౌంటర్ లో చంపేశారు అని DIG తో సహా గుజరాత్ పోలీసులపై సిబిఐ విచారణ వేసి పలు రకాలుగా ఆ పోలీసులను ఇబ్బంది పెట్టారు.
*మరో కేసులో సొహ్రాబుద్దీన్ అనే అమాయకుడిని టెర్రరిస్ట్ అని ముద్ర వేసి గుజరాత్ హోమ్ మంత్రి అమిత్ షా చంపించారు అని యుపిఎ ప్రభుత్వం అమిత్ షా ను జైల్లో పెట్టి ఆరు నెలలు రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించారు.
పలువురు గుజరాత్ పోలీసులను అరెస్ట్ చేసి 7 సం.లు జైల్లో పెట్టారు. ఆఖరుకు సుప్రీంకోర్టు వారిని విడుదల చేసింది.
దేశంలో అన్ని రాష్ట్రాలలో ఎన్కౌంటర్లు దశాబ్దాలుగా జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడా ఏ రాష్ట్ర హోం మంత్రిని కానీ DIG ని కానీ జైలులో పెట్టిన సందర్భం మనకు కనిపించదు. కానీ ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ల విషయంలో మాత్రం సోనియా ప్రభుత్వం రాజకీయ నాయకులపై పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది.
ఒక్క ఇస్లామిక్ తీవ్రవాదుల ఎన్కౌంటర్ కేసులను మాత్రమే కాంగ్రెస్ ఎందుకు వివాదం చేసింది? గుజరాత్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన ఇష్రత్ గొప్ప పోరాటపటిమ గలిగిన యోధురాలు అని లష్కరే తమ వెబ్ పేజీలో రాసుకున్నా ఆమె టెర్రరిస్టు కాదు అని కాంగ్రెస్ నాయకులు ఎందుకు వాదించారు? ఆమె టెర్రరిస్టు అని రుజువు అయ్యాక కూడా ఆమె టెర్రరిస్టు అయితే చట్టానికి పట్టివ్వాలి కానీ కాల్చి చంపేస్తారా అని గుజరాత్ పోలీసులను కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించింది?
“ఈ 26/11 బాంబు దాడులు మాత్రమే కాక దేశం మొత్తం మీద పలు నగరాల్లో బాంబు దాడులు జరుగుతూ ఉన్న సమయంలోనే, 2010లో పాకిస్తాన్‌తో సత్సంబంధాల కోసం భారత జైళ్ళల్లో ఉన్న 25 మంది కరడుగట్టిన ఇస్లామిక్ తీవ్రవాదులను సోనియా గాంధీ యూపీఏ ప్రభుత్వం విడుదల చేసి పాక్ దేశానికి అప్పగించింది. వాళ్ళలో ఒకడు లతీఫ్ అనే వాడే మోడీ ప్రభుత్వ హయాంలో జరిగిన పఠాన్‌కోట్ బాంబు దాడి సూత్రధారి.”
ఎవరికి సాయం చెయ్యడానికి దేశ భద్రత పణంగా పెట్టి టెర్రరిస్టులకు కొమ్ము కాసే విధంగా ఇంత దరిద్రగొట్టు హీనమైన రాజకీయాలు కాంగ్రెస్ చేసింది?
ఇవేవీ జవాబులు దొరకని ప్రశ్నలు.
కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ రాసిన కొత్త పుస్తకం లో ఈ ముంబై దాడలు తరువాత పాకిస్తాన్ మీద దాడి చెయ్యక పోవడం అప్పటి యూపీఏ ప్రభుత్వం వైఫల్యం అని రాసాడు.
అలాగే ఆ రోజు కసబ్ పాక్ వాళ్ళతో మాట్లాడిన ఫోన్ విచారణాధికారికి ఇవ్వకుండా ఇప్పటి వివాదాస్పద ముంబై పోలీస్ కమిషనర్ పరంబీర్ అప్పుడు తీసి దాచిపెట్టాడు అని రిటైర్డ్ ACP షంషేర్ ఖాన్ ఆరోపిస్తున్నారు.
16 సం.ల కిందట ఇదే రోజు ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన NSG, పోలీసు సిబ్బంది సాధారణ పౌరులు, విదేశీ పౌరులకు శ్రద్దాంజలి.