ప్రజాస్వామ్యం అనే పాశ్చాత్య భావజాలానికి చెందిన వ్యవస్థ 18వ శతాబ్దంలో పుట్టింది. ప్రజాస్వామ్యానికీ, ఆధునికతకూ పుట్టినిళ్ళు అమెరికన్, ఫ్రెంచ్ విప్లవాలు అని, వాటితోనే మధ్యయుగాల భావజాలం అంతరించిందనీ ఒకతరహా మేధావులు వాదిస్తూంటారు. ఇక్కడ మనం ప్రజాతంత్రం, జనతంత్రం, లోకతంత్రం అనే మూడు మాటలకు ఉన్న తేడాను సునిశితంగా పరిశీలించాలి. వీటిలో మూడవదైన లోకతంత్రాన్ని ఇవాళ మనం ప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తున్నాం. ఆధునిక ప్రజాస్వామ్యపు సారాంశం… ‘ఫ్రీ విల్ – స్వేచ్ఛాసంకల్పా’న్ని ఆమోదించి అనుసరించడమే. ఫ్రెంచ్ విప్లవ కాలం వరకూ పశ్చిమ ఐరోపాలో ఈ ఫ్రీ విల్ అనే ఆలోచననే అణచివేసారు. అయితే అదేమీ అంత సులువుగా రాలేదు. ఎన్నో ఒడుదొడుకులు, సామూహిక జనహననాల తర్వాత మాత్రమే 1870లో ఫ్రాన్స్‌లో ఐదవ రిపబ్లిక్ ఏర్పడగలిగింది. అంటే ప్రజాస్వామ్యపు తత్వం అనేది ఫ్రెంచ్ సమాజపు నైతిక వ్యవస్థలో జన్మతః ఉన్న గుణం కాదు. దాని పరిణామాన్ని సైద్ధాంతికంగా మాత్రమే అనుసరించారు. మార్టిన్ లూథర్ తన సిద్ధాంతాన్ని జర్మన్ల పవిత్ర ప్రదేశపు గోడల మీద అంటించినప్పుడు తన ప్రాణాలు కాపాడుకోడానికి అక్కడినుంచి పారిపోవలసి వచ్చింది. ఆయన తన సిద్ధాంతాన్ని 1517లో రచించాడు. ఆ తర్వాత మూడేళ్ళకు అంటే 1520లో, మార్టిన్ లూథర్ తన సిద్ధాంతాలు, ప్రతిపాదనలు, రచనలు అన్నింటినీ వదిలిపెట్టేయాలని పోప్ లియో ఎక్స్ డిమాండ్ చేసారు. దానికి నిరాకరించడంతో మార్టిన్ లూథర్‌ను 1521 జనవరిలో బహిష్కరించారు. కొన్నాళ్ళకు రోమన్ చక్రవర్తి చార్లెస్ 5, మార్టిన్ లూథర్‌ను సమాజం నుంచి వెలివేసారు. 1546లో మార్టిన్ లూథర్ చనిపోయే నాటికి కూడా ఆ వెలి ఉత్తర్వులు అలాగే ఉన్నాయి. ఫ్రాన్స్‌లో అల్లర్లు చెలరేగుతున్న ఆ సమయానికి భారతదేశంలో సంత్ కబీర్దాస్ భారత సమాజంలోని రుగ్మతలపై గళమెత్తుతున్నారు. అయితే ఆయనపై ఎలాంటి బహిష్కరణ వేటూ పడలేదు. దాన్నిబట్టే జనతంత్రపు నిజమైన తత్వం భారతీయ నైతికతలో అంతర్భాగమని అర్ధమవుతుంది. కాబట్టి, ప్రజాస్వామ్యం అనేది పాశ్చాత్య దేశాల ప్రసాదం కాదని కచ్చితంగా చెప్పవచ్చు.
మానవ వ్యవస్థలు, ఆలోచనల విషయానికి వస్తే, స్వీయ పరిపాలనకు మూలాలు భారతదేశంలో వేదకాలానికే ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇటీవల హర్యానా హిసార్ జిల్లా రాఖీగఢీలో జరిపిన తవ్వకాలను వైజ్ఞానికంగా పరిశీలించాక వాటిని పురాతత్వవేత్తలు ఆమోదించారు. వాటిని పరిశీలిస్తే లోకతంత్రం అంటే స్వీయ పాలన చేసుకునే సమాజంగా కనిపిస్తుంది. అందులో గ్రామం నుంచి రాజ్యం వరకూ సమగ్ర వ్యవస్థ ఉంది. వాటిలో ఎన్నిక, ఎంపిక, నామినేషన్ అనే మూడు పద్ధతుల్లో పాలకులను నిర్ణయించుకునేవారు. భారతదేశపు సామాజిక-రాజకీయ పద్ధతుల సమీకృత విధానాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే సంప్రదాయ వ్యవస్థలను ‘గ్రామం’ అనే అస్తిత్వం ద్వారా పరికించవచ్చు. అమెరికన్ తత్వవేత్త, మానసిక శాస్త్రవేత్త, విద్యావేత్త అయిన జాన్ డ్యూయీ భారతదేశంలోని గ్రామీణ వ్యవస్థ గురించి ఇలా చెప్పాడు, ‘‘గ్రామ సమాజాలు చిన్నవైన రిపబ్లిక్లు. అవి చిరకాలం మనుగడలో ఉంటాయి. రాజ్యాలకు రాజ్యాలు కూలిపోయినా గ్రామ సమాజాలు యథాతథంగా ఉన్నాయి. దోపిడీలు, విధ్వంసాలను ఎదుర్కొనవలసి వచ్చినా, గ్రామీణులు దగ్గరలోని పల్లెలకు వెళ్ళేవారు, పరిస్థితులు చక్కబడ్డాక మళ్ళీ స్వగ్రామానికి వచ్చి తమ జీవితాలు కొనసాగించేవారు. ఒక్కో గ్రామం దానికదే చిన్న రాజ్యం. అలాంటి గ్రామాల సమూహమే భారతదేశపు నిజమైన బలం. ఎన్ని విప్లవాలు, ఎన్ని మార్పులనైనా తట్టుకుని, ఎన్ని బాధలనైనా భరించి, ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుని మళ్ళీ తమ గ్రామం ఒడిలోకి చేరుకుని ఆనందంగా సంతోషంగా నిలబడడం భారతీయుల లక్షణం. స్వేచ్ఛా స్వతంత్రాల కోసం వారి పోరాటానికి స్ఫూర్తి ఆ గ్రామ వ్యవస్థే. సంప్రదాయిక భారతీయ సమాజాన్ని, దాని నిర్వహణా పద్ధతులనూ అర్ధం చేసుకోడానికి సులువైన పద్ధతి ‘గ్రామాన్ని అర్ధం చేసుకోవడమే’. ఆ సామాజిక వ్యవస్థలు సమగ్రంగా ఉండేవి. అవి వ్యక్తి కేంద్రంగా కాక సమష్టిని ప్రోత్సహించేవి. అదే ప్రజాస్వామ్యానికి అత్యంత అవసరం. గ్రామంలోని వేర్వేరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎంత గాఢంగా ఉండేవంటే వాటి బలం వల్లే గ్రామాల్లో స్వీయ పరిపాలన సాధ్యమయ్యేది. ఆచార సంప్రదాయాల పేరిట ఉండే నియంత్రణల ద్వారా గ్రామాన్ని నిర్వహించే వ్యవస్థే పంచాయత్. ఆ పంచాయతీల సంప్రదాయిక నామ్నీకరణ పద్ధతిని వలస పాలకులు తప్పుగా వ్యాఖ్యానించారు. వారు గ్రామ పంచాయతీలను పాక్షిక న్యాయస్థానాలుగా మాత్రమే పరిగణించారు. దానివల్ల, యుగయుగాలుగా తరతరాలుగా భారత్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మలుగా ఉన్న గ్రామ పంచాయతీ వ్యవస్థను వలస పాలకుల భావజాలాలు తప్పుగా వ్యాఖ్యానించాయి.
గ్రామంలో పరిపాలన అనేది సాధారణంగా గ్రామపెద్ద నిర్వహణ, మార్గదర్శకత్వంలో ఉండేది. వైదిక సాహిత్యంలో ఆ పని చేసే వ్యక్తిని గ్రామణి అనేవారు. బౌద్ధ జాతక కథల్లో కూడా వారు కనిపిస్తారు. సామాన్యశకం మొదటి వెయ్యేళ్ళలో భారతదేశంలోని దాదాపు అన్ని ప్రోవిన్సులలోనూ గ్రామణిలు ఉండేవారు. ఆయననే ఉత్తర భారతదేశంలో గ్రామిక లేక గ్రామేయక అని కూడా వ్యవహరించేవారు. దక్షిణదేశపు తూర్పు భాగంలో మునుంద అని వ్యవహరించేవారు. మహారాష్ట్రలో గ్రాముక్త లేక పట్టకీల అని, కర్ణాటకలో గవుంద అనీ చర్చించేవారు. మిగతా భారతదేశంలో మహాట్టక లేక మహాంతక అని పిలిచి అవమానించేవారు. గ్రామసభల్లో అన్నిపనుల్లోనూ మాట్లాడుతూ ఉండిపోయాను. వారు తొలినాళ్ళలో మతాన్ని, ధర్మాన్నీ ముడిపెట్టేవి కావు. ఆ సమావేశాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక విశేషాలను వివరిస్తూ ఉండేవారు. అలాంటి కాలంలో గ్రామస్తుల మధ్యలో ఎలాంటి ఆంక్షలూ ఉండేవి కావు. క్రమంగా ఈ గ్రామసభలు మరింత ఎదిగాయి. ధార్మికమైన, రాజకీయమైన విషయాలను ఎలాంటి ఆంక్షలూ, అరమరికలూ లేకుండా చర్చించుకునే వేదికలుగా నిలిచాయి. ఆ అనుభవంతో కాలక్రమంలో నియమ నిబంధనలు రూపొందేవి. ప్రతీ సభా తనదైన రాజ్యాంగాన్ని కలిగి ఉండేది. భారతదేశపు ప్రాచీన రాజ్యాంగంలో పంచాయతీ అనేది భాగం మాత్రమే కాదు, రాజ్యపు రాజు ఎవరైనా సరే, గ్రామాలు వాటంతట అవి స్వతంత్రంగా పనిచేసేవి.
అయితే 19వ శతాబ్దంలో ప్రాచీన పద్ధతులను పాటించే పురాతనమైన ప్రజాస్వామిక వ్యవస్థ అయిన పంచాయతీలు, వలస పాలకుల ఉదారవాద సంస్కరణవాద అజెండాలో ఒకరకమైన మునిసిపల్ బాడీగా మారిపోయాయి. వలస పాలనతో కలయిక క్షేత్రస్థాయిలో నిర్వహణా వ్యవస్థను మాత్రమే కాదు, మొత్తంగా సమాజ స్వరూపాన్నే దెబ్బతీసింది. సామ్రాజ్యాల తప్పులు వ్యవస్థ పరిణామాన్ని దెబ్బతీసాయి, చారిత్రక వ్యవహారాలను వక్రీకరించాయి, సమాజంపై బలవంతంగా హింసాత్మకమైన వ్యవస్థలను రుద్దాయి. ఆ పరిణామాన్నే ఒక చరిత్రకారుడు, ‘‘ఇకపై ఈ పంచాయతీలు గ్రామ ప్రజలకు ప్రతినిధులు కావు, ప్రభుత్వానికి సేవకులు’’ అని వ్యాఖ్యానించాడు.
పూర్వకాలంలో పంచాయతీ వ్యవస్థ చట్టబద్ధత గొప్పదనాన్ని మున్షీ ప్రేమ్‌చంద్ తన ప్రఖ్యాత కథ ‘పంచ్ పరమేశ్వర్’ (1916)లో అద్భుతంగా చిత్రీకరించారు. అందులో అల్గూ, జుమ్మన్ అనే రెండు ప్రధాన పాత్రలుంటాయి. వారిద్దరూ పంచాయతీలో సర్పంచ్‌లే. ఒకరి కేసుకు మరొకరు సర్పంచ్‌గా ఉంటారు. మొదట అల్గు గ్రామ సర్పంచ్‌గా జుమ్మన్‌కు వ్యతిరేకంగా తీర్పునిస్తాడు. కొన్నిరోజుల తర్వాత జుమ్మన్ సర్పంచ్‌గా అల్గుకు సంబంధించిన కేసులో తీర్పు చెప్పాల్సి వస్తుంది. అప్పుడు జుమ్మన్, అల్గుకు అనుకూలంగా తీర్పునిస్తాడు. సర్పంచ్ అనేవాడి ప్రామాణికత ఎంత గొప్పగా ఉండేదో ప్రేమ్‌చంద్ అద్భుతంగా చిత్రించాడు. ‘‘జుమ్మన్ పంచాయతీ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాడు. ‘నేను న్యాయం, ధర్మాల అత్యున్నత సింహాసనం మీద కూర్చుని ఉన్నాను. నా నోటినుంచి వచ్చే ప్రతీ మాటా దేవుడి మాటలా గౌరవాన్ని పొందుతుంది. నేను సత్యం నుంచి ఒక్క అంగుళం కూడా తప్పకూడదు’ అని జుమ్మన్ అనుకున్నాడు. అంతకుముందు తన కేసు విషయంలో అల్గు న్యాయబద్ధంగా వ్యవహరించాడని కూడా అర్ధం చేసుకున్నాడు. అతను తన స్నేహితుడికి ఇలా చెప్పాడు. ‘‘ఇవాళ నేను పంచ్‌గా ఒక విషయం నేర్చుకున్నాను. అదేంటంటే నేను ఎవరికీ స్నేహితుణ్ణి కాను, శత్రువునూ కాను. పంచ్ అనేవాడు న్యాయం తప్ప మరి దేన్నీ చూడకూడదు. పంచ్ నోటి ద్వారా స్వయంగా భగవంతుడే మాట్లాడతాడని నేను ఇవాళ అర్ధం చేసుకున్నాను.’’ ఈ అపురూపమైన, మార్మికమైన న్యాయం అనే భావన కచ్చితంగా భారతీయ సమాజానికీ, సంస్కృతికీ కొత్తగా పరిచయమైన భావన అయితే కాదు.
ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన దేశం భారతదేశం. ఇక్కడ ఎన్నో జాతులు, మతాలు, సంస్కృతులు, తెగలు ఉన్నాయి. అయినప్పటికీ ఇవాళ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద విజయవంతమైన, పనిచేస్తున్న ప్రజాస్వామ్యంగా ఉందంటే దానికి కారణం ఇక్కడి ప్రజలే. సమానత్వపు స్ఫూర్తి వారిలో నిండిఉంది. వైదిక కాలం నుంచి వారి మనసుల్లో, ఆచరణలో ప్రజాస్వామిక పరంపర కొనసాగుతూ వస్తోంది. అది మిగతా ప్రపంచానికి ఆశ్చర్యకరమైన విషయమే.