తిరుమల శ్రీవారి హుండీలో చోరీ జరిగింది. ఈ ఘటన నవంబరు 23న చోటు చేసుకుంది. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా భద్రతా సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. తిరుమల శ్రీవారి స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం చోరీ చేసినట్లు గుర్తించారు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.15 వేలు రికవరీ చేశారు.
తిరుమలలో చోరీ జరిగినా భద్రతా సిబ్బంది గుర్తించలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించే వరకు చోరీ జరిగిన విషయం గుర్తించలేకపోయారు. వేణులింగం నేర చరిత్రపై పోలీసులు కన్నేశారు. అతడు నేర చరిత్ర కలిగిఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.