ఈ నెల 29న ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ఏపీ పర్యటన రద్దైంది. వాయుగుండం తుఫానుగా మారే ప్రమాదం ఉండటంతో ప్రధాని పర్యటన రద్దైనట్లు తెలుస్తోంది. నవంబరు 29న విశాఖలో రైల్వే జోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రధాని పర్యటన వాయిదా పడింది.
మరలా ఏపీలో ప్రధాని పర్యటన ఎప్పుడు ఉంటుందనే విషయం త్వరలో ప్రకటించనున్నారు. ఏపీలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రధాని మోదీ పర్యటన రద్దైంది. ప్రధాని మోదీ పలు శంకుస్థాపనలతోపాటు, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సభ కూడా రద్దైంది.