పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ జరగకుండానే బుధవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ లోక్‌సభ, రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ లంచాల ఆరోపణలపై అమెరికాలో నమోదైన కేసులపై చర్చ చేపట్టాలంటూ సభ్యులు తీవ్ర నిరసనకు దిగారు. ఉభయసభల్లో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ లోక్‌సభను బుధవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ సభ్యులు అదానీ లంచాల కేసుపై చర్చకు పట్టుబట్టారు. విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సభ అదుపులోకి రాకపోవడంతో బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ ధన్‌ఖడ్ ప్రకటించారు.
ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు సోలార్ విద్యుత్ అమ్మేందుకు అదానీ గ్రూపు కంపెనీ చేసుకున్న ఒప్పందాల్లో 2039 కోట్లు చేతులు మారాయని అమెరికాలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ ఉభయసభల విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభలో విపక్ష సభ్యులు పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. సభ్యులు ఎంత సేపటికీ నిరసనలు ఆపకపోవడంతో సభలు బుధవారానికి వాయిదా వేశారు.