అండమాన్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గస్తీలో ఉన్న నేవీ దళాలు చేపల వేట చేసే పడవ నుంచి 5 టన్నుల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. తీర రక్షణ దళం ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారని తెలుస్తోంది. దీని విలువ మార్కెట్లో రూ.5వేల కోట్లకుపైగానే ఉంటుందని అంచనా.
డ్రగ్స్ తరలిస్తోన్న ముఠాను నేవీ సిబ్బంది అదుపులోకి తీసుకుంది. వారిని విచారిస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎక్కడ నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నారు.
ఇటీవల కాలంలో దేశంలో డ్రగ్స్ విక్రయాలు పెరిగిపోయాయి. పొరుగు దేశాల నుంచి దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్నారు. ఓ వైపు పాక్ సరిహద్దు నుంచి, గుజరాత్ సముద్ర తీరం నుంచి పెద్ద ఎత్తున దేశంలోకి మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయి. దీనిపై కేంద్ర నిఘా సంస్థలు దృష్టి సారించాయి.పోలీసులు, సైన్యం పెద్ద ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటున్నాయి.