భారత టాప్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దాదాపు 16 నెలల తర్వాత టెస్టుల్లో సెంచరీ చేశాడు. పెర్త్ వేదికగా ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ ఈ సెంచరీ చేశాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ, 143 బంతుల్లోనే శతకం సాధించాడు. కోహ్లీ సెంచరీతో భారత్ స్కోరు 487కు చేరింది. దీంతో టీమ్ ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలిపి ఆసీస్ ముందు 534 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ (161) ఔట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన తెలుగుకుర్రాడు నితీశ్ రెడ్డి రెండో ఇన్నింగ్స్ లో చకచకా 27 బంతుల్లో 38 పరుగులు చేశాడు.
కేఎల్ రాహుల్ (77), దేవదత్ పడిక్కల్ (25), రిషబ్ పంత్ (1), ధ్రువ్ జురైల్ (1), వాషింగ్టన్ సుందర్ (29) పరుగులు చేశారు. భారత్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసే సమయానికి 134.3బంతులు ఆడి ఆరు వికెట్లు నష్టపోయి 487 పరుగులు చేసింది.
ఇక, 534 పరుగుల టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను బుమ్రా ఆరంభంలోనే దెబ్బతీశాడు. ఓపెనర్ నాథన్ మెక్ స్వీనీ(0)ని బుమ్రాను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పాట్ కమిన్స్ (2)ను సిరాజ్ వెనక్కిపంపాడు. సిరాజ్ వేసిన 3.1 బంతిని ఆడిన కమిన్స్ విరాట్ కోహ్లీకి క్యాచ్ గా దొరికిపోయాడు. లబూ షేన్ (3) ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఆసీస్ 12 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 4.2 బంతులు ఆడి 12 పరుగులు చేసింది. విజయం కోసం ఇంకా 522 పరుగులు చేయాల్సి ఉంది.