పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయి. సమావేశాల నేపథ్యంలో పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష నేతల సమావేశం అయ్యారు. వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
శీతాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వివిధ అంశాలపై ఈ సమావేశంలో నేతలు సమాలోచనలు చేస్తున్నారు. సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని ప్రభుత్వం ప్రతిపక్ష కూటమిని కోరనుంది.
ఈ సమావేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతుల సమస్యలను ప్రతిపక్షాలు లేవనెత్తే అవకాశం ఉంది.
వక్ఫ్ సవరణ బిల్లు, ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ బిల్లులను పాలకపక్షం సభముందుకు తీసుకురానుంది. ఇక స్వతంత్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహించనున్నట్లు కిరెన్ రిజిజు తెలిపారు.