జోర్డాన్‌లో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద తీవ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.లెబనాన్ కేంద్రంగా పనిచేస్తోన్న హెజ్బొల్లా తీవ్రవాదులు ఈ కాల్పులకు దిగినట్లు ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. కొందరు సాయుధులైన ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ఎంబసీ సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. వెంటనే ఇజ్రాయెల్ ఎంబసీ రక్షణ సిబ్బంది ఎదురు కాల్పులకు దిగింది. ఈ దాడిలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ముగ్గురు రక్షణ సిబ్బందికి గాయాలయ్యాయి.
జోర్డాన్‌లో ఎక్కువగా పాలస్తీనా మూలాలున్న వారు నివాసం ఉంటున్నారు. గతంలోనూ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజాగా ఉగ్రదాడి జరగడంతోఎంబసీ వద్ద భద్రత మరింత పెంచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
గత ఏడాది అక్టోబరు 27న ఇజ్రాయెల్‌పై హమాస్ తీవ్రవాదులు జరిపిన మెరుపు దాడిలో 14 వందల మంది అమాయకులు బలయ్యారు. అప్పటి నుంచి పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది. 14 నెలలుగా సాగుతోన్న పోరులో 43 వేల మంది పాలస్తీనా పౌరులు మరణించారు. వేలాది ఉగ్రవాదులను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. కాల్పుల విరమణకు ఖతర్, ఈజిప్ట్ చేసిన రాజీ ప్రయత్నాలు ఫలించలేదు.