ఉత్తరప్రదేశ్ శంబల్లో దేవాలయంపై మసీదు నిర్మించారనే కేసులో అక్కడ సర్వేకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సర్వే అధికారులు ఇవాళ శంబల్లోని షాహి జామా మసీదుకు చేరుకున్నారు. వారు అక్కడికి చేరుకోగానే వారిపై కొందరు రాళ్ల దాడికి దిగారు. దీంతో అధికారులను పోలీసులు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ స్పందించారు. ఆదివారం ఉదయం ప్రారంభమైన సర్వే పనులను కొందరు విద్రోహ శక్తులతో అడ్డుకోవాలని చూస్తున్నారని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు.
దేవాలయంపై మసీదు నిర్మించారంటూ యూపీకి చెందిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్
కోర్టును ఆశ్రయించారు. సర్వే నిర్వహించాలని కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు గత నెల 19న ఒక సారి సర్వే నిర్వహించారు. మరోసారి ఇవాళ సర్వే చేపట్టేందుకు అధికారులు రాగానే పెద్ద ఎత్తున రాళ్ల దాడికి జరిగింది.
సర్వేకు సహకరించాలని మసీదు కమిటీకి పోలీసు అధికారులు కోరారు. ఆదివారం రాళ్లు రువ్విన వారిలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాళ్లు రువ్విన వారిపై పోలీసులు భాష్ఫవాయుగోళాలను ప్రయోగించారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది.