బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో భారత్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీ చేశాడు. 94 పరుగులు వద్ద సిక్స్ బాది సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న తొలిసారే యువ ఆటగాడు శతకం కొట్టి సరికొత్త ఘనత సాధించాడు. తొలి ఆసీస్ పర్యటనలో ఎంఎల్ జైసింహా (బ్రిస్బెన్), సునీల్ గవాస్కర్ (బ్రిస్బెన్) సెంచరీలు చేసి రికార్డు నెలకొల్పారు.
ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన రెండో యువ ఓపెనర్‌గా జైస్వాల్ రికార్డుకెక్కాడు. అతడు 22ఏళ్ల 330 రోజుల వయసులో ఈ ఘనత సాధించడం విశేషం. కేఎల్ రాహుల్ 22 ఏళ్ల 263 రోజుల వయసులో ఈ ఫీట్ సాధించాడు.
ఓవర్‌నైట్ స్కోర్ 172/0తో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ మరో 29 పరుగులు చేసిన తర్వాత అంటే 201 పరుగుల వద్ద కేఎల్ రాహుల్ (77) వికెట్‌ను కోల్పోయింది. స్టార్క్ వేసిన 62.6 బంతిని ఆడి క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ క్రీజులోకి వచ్చాడు
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 321 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్ (141*) , దేవదత్ పడిక్కల్ (25*) క్రీజులో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి ఒక వికెట్ నష్టానికి 275 పరుగులు చేసింది.