మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించడంపై ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభివృద్ధి, సుపరిపాలన గెలిచాయని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. చారిత్రక విజయాన్ని అందించారంటూ మహారాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి పట్ల మీరు చూపించిన ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేం అని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పురోగతికి ఎన్డీయే కూటమి నిరంతరం కృషి చేస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నాఅని వెల్లడించారు.
288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 228 స్థానాల్లో విజయం దిశగా మహాయుతి కూటమి దూసుకెళుతోంది. 149 చోట్ల పోటీ చేసిన 132 సీట్లలో ఆధిక్యంలో ఉంది. అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 చోట్ల, షిండే నాయకత్వం వహిస్తున్న శివసేన 56 స్థానాల్లో విజయం దిశగా దూసుకెళుతున్నాయి. మహా వికాస్ అఘాడీ కూటమికి ఘోర పరాభవం ఎదురైంది. థాకరే శివసేన, శరద్ పవార్ పార్టీలు ఘోరంగా ఓడాయి.