ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆర్థిక కమిటీల్లో భాగంగా ప్రజాపద్ధుల కమిటీ, శాసనసభ అంచనాల కమిటీ, ప్రభుత్వ సంస్థల కమిటీలకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సభ్యులను ఎన్నుకున్నారు.
రాష్ట్ర శాసనసభ కమిటీ హాల్లో జరిగిన ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్ సహా కూటమి ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వైసీపీ ఓటింగ్‌ను బహిష్కరించింది.
పీఏసీ చైర్మన్ పదవి కోసం వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తొలుత నామినేషన్ దాఖలు చేశారు. అయితే వైసీపీకి అవసరమైన బలం లేకపోవడంతో కూటమి ఎమ్మెల్యేలు పోటీకి బరిలో దిగారు. దీంతో వైసీపీ ఓటింగ్ ను బహిష్కరించింది.
కమిటీల్లో సభ్యుడుగా ఎన్నిక అవ్వాలంటే 20 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. వైసీపీకి శాసనసభలో 11 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.
ప్రజా పద్దుల కమిటీ సభ్యులుగా ఆనంద బాబు నక్కా, ఆరిమిల్లి రాధాకృష్ణ,ముతుముల అశోక్ రెడ్డి , బూర్ల రామాంజనేయులు, బి జయనాగేశ్వర్ రెడ్డి, కొల్లా లలిత కుమారి, రాజగోపాల్ శ్రీరామ్, రామాంజనేయులు పులపర్తి, విష్ణుకుమార్ రాజు పెన్మెత్స ఎంపికైనట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
అంచనాల కమిటీ సభ్యులుగా అఖిల్ ప్రియ భూమా, బండారు సత్యానంద రావు, జయకృష్ణ నిమ్మక, జోగేశ్వరరావు వేగుళ్ల, కందుల నారాయణరెడ్డి, మద్దిపాటి వెంకటరాజు, పార్థసారథి వాల్మీకి, పసిం సునీల్ కుమార్, ఏలూరి సాంబశివరావు ఎన్నికయ్యారు.
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ లో సభ్యులుగా అయితా బత్తుల ఆనందరావు, ఈశ్వర్ రావు నడికుడిటి, గిడ్డి సత్యనారాయణ, గౌతు శిరీష, కూన రవికుమార్, కుమార్ రాజా వర్ల, బేబీ నాయన, తెనాలి శ్రావణ్ కుమార్, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఎంపికైయ్యారు.