భారత్ కు 46 పరుగుల ఆధిక్యం
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లోజరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ లో 104 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ స్కోర్ 67 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ మరో 37 పరుగులు మాత్రమే చేయగల్గింది. మిగతా మూడు వికెట్లు వెంటవెంటనే కోల్పోయింది.
భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులు చేసింది. దీంతో భారత్ కు 46 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఆలెక్స్ కేరీ( 21), మిచెల్ స్టార్క్ (26 ) పరుగులు చేశారు.
భారత బౌలర్లలో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లు తీయగా అరంగేట్ర హర్షిత్ రాణా మూడు వికెట్లు పడగొట్టాడు. మరో పేసర్ మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లు తీయడంతో ఆసీస్ కుప్పకూలింది.
46 పరుగుల ఆధిక్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు జైస్వాల్( 13), కేఎల్ రాహుల్(7) క్రీజులో ఉన్నారు.