లైంగిక వేధింపుల కేసును ఎదుర్కొంటోన్న కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ బెయిల్ రద్దును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
అక్టోబర్ 24న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం సమర్థించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మార్చలేమని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
తన వద్ద జూనియర్‌గా చేస్తోన్న డ్యాన్సర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నార్సింగి పోలీసులు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. జూనియర్ డ్యాన్సర్ బాలికగా ఉన్నప్పటి నుంచి లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో జానీమాస్టర్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. జాతీయ అవార్డు సందర్భంగా తాత్కాలిక బెయిల్ లభించినా, తరవాత అది రద్దు చేశారు. జాతీయ అవార్డును కూడా వెనక్కు తీసుకుంటున్నట్లు కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే.