కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి శుక్రవారం రూ.100 కోట్ల పరువునష్టం దావా నోటీసులు జారీ అయ్యాయి. తనపై చేసిన ఆరోపణలకు గానూ బీజేపీ నేత వినోద్ తావ్డే వాటిని కోర్టు ద్వారా పంపారు. నోటీసుల్లో సుప్రియా శ్రినేట్ పేరు కూడా ఉంది.
పాల్‌ఘర్ జిల్లాలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ హోటల్‌లో బీజేపీ నేతలు డబ్బులు పంచుతున్నారని ప్రాంతీయ బహుజన్ వికాస్ అఘాడీ పార్టీ
మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ కు ముందు ఆరోపించింది. నాలసోపరా నియోజకవర్గం నుంచి కమలం గుర్తుపై పోటీలో ఉన్న బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్‌కు ఓటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి వినోద్ తావ్డే మరికొందరు నాయకులు ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించింది.
దానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలి అంటూ రాసుకొచ్చింది. బీవీఏ ఆరోపణలను బీజేపీతో పాటు తావ్డే ఖండించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలకు నేడు పరువునష్టం నోటీసులు పంపారు.
సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను ఎప్పుడు అలాంటి చర్యలకు పాల్పడలేదని తావ్డే అన్నారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించే కుట్ర చేశారని ఆరోపించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు