పెర్త్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆసీస్ ఆపసోపాలు పడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 150 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ ను షార్ప్ బౌలింగ్ తో బుమ్రా ముప్పుతిప్పలు పెట్టాడు. వరుసగా మూడు వికెట్లు పడగొట్టాడు. యువ ఆటగాడు హర్షిత్ రానా కూడా కీలక వికెట్ పడగొట్టాడు. సిరాజ్ రెండు వికెట్లు తీశాడు.
ఆసీస్ ఓపెనర్ స్వీనీ (10)ని 2.3 బంతికి బుమ్రా ఎల్బీ చేశాడు. దీంతో ఆసీస్ 14 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత ఉస్మాన్ ఖ్వాజా( 8) కూడా బుమ్రా బౌలింగ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో 19 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్మిత్ ను బుమ్రా డకౌట్ చేశాడు.
యువ బౌలర్ హర్షిత్ రాణా, కీలక వికెట్ పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ (11) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత సిరాజ్ వేసిన 16.5 బంతికి మిచెల్ మార్ష్ ( 6)ను సిరాజ్ వెనక్కిపంపాడు. క్రీజులో పాతుకుపోయిన లబూషేన్ ను కూడా సిరాజ్ ఔట్ చేశారు. లబూషేన్ 52 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ ఆరు వికెట్లు నష్టపోయి 47 పరుగులు చేసింది.
మరోసారి బుమ్రా సత్తా చాటాడు. 24. 2 బంతికి ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ (3) ను పెవిలియన్ కు చేర్చాడు. దీంతో ఆతిథ్య జట్టు ఏడు వికెట్లు నష్టపోయి 59 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆసీస్ మరో 91 పరుగులు చేయాల్సి ఉంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు