హైదరాబాద్ లో భాగ్యనగర్ లోక్ మంథన్
భిన్న సంస్కృతుల సమ్మేళనంతో భారత్ , సుందరమైన ఇంద్రధనస్సులా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని అన్నారు.హైదరాబాద్ లోని శిల్పారామంలో నిర్వహించిన లోక్‌మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు.
దేశ సంస్కృతి, సంప్రదాయాలను బలోపేతం చేసే ఇలాంటి గొప్ప కార్యక్రమాలు అవసరం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. 2018 రాంచీలో జరిగిన లోకమంథన్ లో ప్రత్యక్షంగా పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు.
భారతదేశ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, మన పరంపర చాలా ఘనమైనదన్నారు. వనవాసి, నగరవాసి అని తేడా లేకుండా అందరూ భారతవాసులం అనే విషయాన్ని మరవొద్దు అన్నారు.
లోకమంథన్ కార్యక్రమంలో అహల్యాబాయ్ హోల్కర్, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీరమహిళల గురించి ప్రదర్శనలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా ప్రస్తుత సమయంలో మళ్లీ భారతదేశ జ్ఞానాన్ని పంచాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. విదేశీ శక్తులు శతాబ్దాలుగా, భారత్ పై జులూం ప్రదర్శించి సంస్కృతిని, భాషను, సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను విధ్వంసం చేశాయన్నారు.
ఐకమత్యాన్ని దెబ్బతీసి బానిస మూలాలను చొప్పించారన్నారు.ప్రస్తుతం భారతదేశం బానిసత్వ మూలాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజ్ పథ్ పేరు కర్తవ్యపథ్ గా, దర్బార్ హాల్ పేరు.. గణతంత్ర మండప్ గా మార్చామన్నారు. ఐకమత్యం, సమరసతే మన సభ్యత.. మన భవిష్యత్తు రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు