టాప్ స్కోరర్ గా తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (41)
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 150కి ఆలౌట్ అయింది. నితీశ్‌రెడ్డి (41),పంత్ (37), కేఎల్ రాహుల్( 26) ఫరవాలేదనిపించగా మిగతా వారు తీవ్రంగా నిరాశపరిచారు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్(0), వన్‌డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(0) డకౌట్ కావడంతో స్కోర్ బోర్డుపై తీవ్ర ప్రభావం పడింది. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(5) కూడా నిరాశపరిచాడు.
రిషబ్ పంత్ (37), ధ్రువ్ జురైల్ (11), వాషింగ్టన్ సుందర్ (11), హర్షిత్ రానా (7), జస్ప్రీత్ బుమ్రా (8), మహ్మద్ సిరాజ్ నాటౌట్ గా ఉన్నాడు.
ఆసీస్ బౌలర్లలో హేజల్‌వుడ్ 4.. స్టార్క్, మిచెల్, కమిన్స్ తలా రెండు వికెట్లు తీశారు.
కేఎల్ రాహుల్ ను థర్డ్ అంపైర్ ఔట్ గా ప్రకటించడం వివాదాస్పదమైంది. రాహుల్ షాట్ ఆడబోగా బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ చేతుల్లో పడింది. దీనిని ఆన్ ఫీల్డ్ అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అయితే ఆసీస్ రివ్యూకు వెళ్ళడంతో థర్డ్ అంపైర్ దానిని ఔట్ గా ప్రకటించాడు. ఈ నిర్ణయాన్ని పలువురు భారత మాజీ క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా తప్పుపట్టారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు