నటుడు, సినీ రచయిత వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి రాజకీయాలకు స్వస్తి పలికారు. ఇక జీవితంలో ఎన్నడూ రాజకీయాలు మాట్లాడనని మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తాను ఏ పార్టీ నాయకుడిని విమర్శించలేదని వారి విధానాలు నచ్చకపోతే వాటిపై మాత్రమే విమర్శలు చేశానన్నారు. అవినీతికి పాల్పడే వారినే విమర్శించానని గుర్తుచేశారు. చంద్రబాబునాయుడు తనకు ఎంతో ఆప్తుడని చెప్పారు. ఆయన ఇంటికి వెళ్లి ఆశీస్సులు కూడా తీసుకున్నట్లు గుర్తుచేశారు.
తనపై 15 సంవత్సరాల యవత నుంచి 85 సంవత్సరాల వృద్ధుల వరకు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తనకు బాగా తెలుసని, ఆయన అవినీతి మచ్చ లేని నాయకుడని పొగడ్తల వర్షం కురిపించారు. 1983 నుంచి రాజకీయాల గురించి మాట్లాడుతున్నానన్నారు. ఇక నుంచి తన బిడ్డలు, భార్య కోసమే జీవిస్తానని పోసాని చెప్పారు.
నటుడు పోసానిపై ఏపీలో ఐదు కేసులు నమోదయ్యాయి. సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ పలువురు నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అయితే కేసులకు భయపడే వ్యక్తిని కాదంటూ పోసాని తాజాగా ప్రకటించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను నటుడు పోసాని క్షమాపణలు చెప్పాలని ఓ సినీ నిర్మాత డిమాండ్ చేశారు. క్షమాపణలు కోరి రాజకీయాలు విరమిస్తే జనం నమ్ముతారని ఆ నిర్మాత అభిప్రాయపడ్డారు. పోసానిపై నమోదైన కేసులను సీఐడికి అప్పగించారు. పోసానికి మరో రెండు రోజుల్లో పోలీసులు నోటీసులు జారీ చేయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు