ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ శాసనసభల ఎన్నికలతో పాటు 15 రాష్ట్రాల్లోని 2 లోక్‌సభ స్థానాలు, 48 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపయెన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింలు ఎక్కువగా ఉండే మొరాదాబాద్ జిల్లాలో కూడా ఉపయెన్నికలు జరిగాయి. అక్కడ మీడియా మొత్తం ముస్లింలే ఉండడంతో, ప్రచారమంతా ఏకపక్షంగా జరిగింది. దాన్నే మీడియా జిహాద్‌గా అభివర్ణించారు బీజేపీ ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠీ.
‘‘మొరాదాబాద్‌ను కవర్ చేసిన జర్నలిస్టుల జాబితా చూడండి. ఉత్తరప్రదేశ్ ఉపయెన్నికల్లో అత్యధికంగా అబద్ధాలు ప్రచారమైనది ఇక్కడినుంచే. వీడియోలు, ఫొటోలు ఎడిట్ చేసి తప్పుడు సమాచారాన్ని విస్తృతంగా ప్రచారంలో పెట్టారు’’ అంటూ శలభ్‌మణి త్రిపాఠీ ఎక్స్‌లో ట్వీట్ చేసారు. దానితో పాటు మొరాదాబాద్‌లో ఎన్నికల కవరేజిలో పాల్గొన్న మీడియా ప్రతినిధుల జాబితాను పోస్ట్ చేసారు.
స్థానిక దినపత్రికలు, టీవీ ఛానెళ్ళ నుంచి రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి ప్రసార మాధ్యమాల ప్రతినిధులు మొత్తం 32మంది పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి. వారందరూ ముస్లిములే. ఇంకా, మొరాదాబాద్ కేంద్రంగా సుమారు వంద మంది ముస్లిం యూట్యూబర్లు క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
కొన్ని వారాల క్రితం దసరా నవరాత్రుల్లో బహ్రెయిచ్‌లో జరిగిన హింసాకాండలో 22ఏళ్ళ రాంగోపాల్ మిశ్రాను ముస్లింలు దారుణంగా హత్య చేసారు. ఆ సందర్భంలో అక్కడి వార్తలను కవర్ చేసిన వారు అందరూ ముస్లిములే. ప్రధానస్రవంతి వార్తాపత్రికలు, టీవీఛానెళ్ళ నుంచి స్థానికంగా ఉండే పత్రికలు, యూట్యూబ్ ఛానెళ్ళ వరకూ అన్నిటి పాత్రికేయులూ ముస్లిములే. వారి పేర్ల జాబితాను కూడా శలభ్‌మణి త్రిపాఠీయే బైటపెట్టారు. ‘‘బహ్రెయిచ్ నుంచి వార్తలు పంపే జర్నలిస్టుల పేర్లు చదవండి చాలు. మీకు ఆ వార్తలు ఎంత నిజమో, ఎంత నిష్పక్షపాతమైనవో అర్ధమైపోతుంది. ప్రత్యేకంగా కొంతమంది యూట్యూబర్లను ఇదే పనిమీద పెట్టుకున్నారు. వారు ఇచ్చిన సమాచారాన్నే అందరూ ప్రచారం చేస్తారు. గొడవలు చేసేవారిని, అబద్ధాలు, పుకార్లు వ్యాపింపజేసేవారినీ జాగ్రత్తగా రక్షించడంలో ఈ మీడియా ప్రతినిధులు అందరూ కలిసికట్టుగా పనిచేసారు’’ అని త్రిపాఠీ చెప్పారు.
‘‘గోపాల్ మిశ్రా ఒక ఇంటిపైన ఆకుపచ్చ జెండా తొలగించిన దృశ్యాలు మాత్రమే బైటకు వచ్చాయి. అంతకుముందు ఆ ఇంటినుంచే దుర్గాదేవి విగ్రహం మీద జరిగిన దాడి, హిందువుల ఊరేగింపుపై రాళ్ళు రువ్వడం, తగులబెట్టడం, ఆ ఇంటివారే గోపాల్ మిశ్రాను చంపడానికి సంబంధించిన దృశ్యాలు ఎందుకు ఎలా మాయమైపోయాయి? దానికి జవాబు బహ్రెయిచ్‌లోని జర్నలిస్టుల జాబితాలో ఉంది. అందులోని పేర్లను పరిశీలిస్తే తెలిసిపోతుంది’’ అని ఆయన వివరించారు.
శలభ్‌మణి త్రిపాఠీ బహ్రెయిచ్‌లో ప్రధానమైన 13మంది జర్నలిస్టుల పేర్లను బహిర్గతం చేసారు. వారిలో ఇండియా టీవీ, పీటీఐ, ఏఎన్ఐ సంస్థల రిపోర్టర్ల పేర్లు కూడా ఉన్నాయి. ఆ జాబితా బైటకు రావడంతో బహ్రెయిచ్‌లో ప్రభుత్వ సమాచార అధికారి వారిస్ అలీని ఉద్యోగం నుంచి తొలగించారు.
మొరాదాబాద్‌లో ఉపయెన్నిక వేళ ఏం జరిగింది?:
నవంబర్ 20న ఉపయెన్నిక పోలింగ్ జరుగుతుండగా మొరాదాబాద్ నుంచి ఆందోళనకరమైన సమాచారం చాలా వచ్చింది. అక్కడ ఫేక్ ఓటింగ్ జరుగుతోందంటూ బీజేపీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా కుండార్కీ, శిశామావ్ నియోజకవర్గాల్లో ఫేక్ ఓటింగ్ విపరీతంగా జరిగిందని ఫిర్యాదు చేసారు. బైటి గ్రామాలు, పట్టణాల నుంచి పెద్దసంఖ్యలో ముస్లిములను ఓటింగ్ కోసం తీసుకొచ్చారు, వారికి నకిలీ గుర్తింపు కార్డులు అందజేసారు.
ఆ సందర్భంగా బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులో ఇలా రాసారు, ‘‘ఆ నియోజకవర్గాల్లో బైటి జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు స్థానిక మసీదులు, మదరసాల్లో ఆశ్రయమిచ్చారు. వాళ్ళకు నకిలీ గుర్తింపు కార్డులు తయారుచేసి, వాళ్ళతో దొంగ పోలింగ్ చేయించారు. గతంలో చనిపోయినవారు, అసలు జిల్లాలోనే లేనివారి పేర్లతో దొంగఓట్లు వేసే పని నిరాఘాటంగా సాగిపోయింది. కాబట్టి ఆ ప్రాంతాల్లోని ఓట్లను అన్ని బూత్‌లలోనూ ఓటర్ల గుర్తింపు కార్డులను, సమగ్రంగా తనిఖీ చేసి ఆ తర్వాతే అక్కడ ఓటు వేయడానికి అనుమతించారు.
కుండార్కీ అసెంబ్లీ నియోజకవర్గం ఉపయెన్నికలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్ధి హాజీ రిజ్వాన్ భిఖాన్పూర్ కుల్వారా పోలింగ్ స్టేషన్ వద్ద హంగామా చేసిన వీడియో వైరల్ అయింది. అతను అక్కడి ఓటర్ల ఐడి కార్డులు లేదా ఆధార్ కార్డులను పోలీసులు తనిఖీ చేయడాన్ని అడ్డుకున్నాడు. అక్కడ తనను రానీయకుండా పోలీసులు బ్యారికేడ్స్ పెట్టడం పైనా నిరసన కార్యక్రమం చేపట్టాడు.
ఆ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్, జిల్లా అధికారులూ ఎన్నికల విధల్లో ఉన్న ఏడుగురు పోలీసుల మీద చర్యలు తీసుకున్నారు. కుండార్కీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రక్రియను ప్రభావితం చేసారన్న ఆరోపణల మీద ఇద్దరు కానిస్టేబుళ్ళు, ఒక సబ్ ఇనస్పెక్టర్ మీద చర్యలు తీసుకున్నారు. అలాగే సీసామావ్ నియోజకవర్గంలో ఇద్దరు సబ్-ఇనస్పెక్టర్లను సస్పెండ్ చేసారు. ముజఫర్‌నగర్‌లో నియమనిబంధనలను ఉల్లంఘించినందుకు మరో ఇద్దరు ఇనస్పెక్టర్ల పైనా వేటు పడింది’’ అని త్రిపాఠీ వివరించి చెప్పారు.