జమ్ముకశ్మీర్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే సున్నాకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.
శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, నవంబర్ 23 వరకు కశ్మీర్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు ఏర్పడి ఎత్తైన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉందని విశ్లేషించింది.
ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్ కాగా, పహల్గామ్లో -3.2 డిగ్రీల సెల్సియస్, షోపియాన్‌లో-3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
గుల్ మార్గ్ లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్ , కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కోకర్నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్, బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.