బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. సిరీస్ లో భాగగా పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కు బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ శర్మ గైర్హాజరు నేపథ్యంలో ఆ టెస్టు మ్యాచ్‌కు బుమ్రా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు.
కెప్టెన్సీని ఓ పోస్టుగా భావించడం లేదని, బాధ్యతలను ప్రేమిస్తానని, కఠినమైన పని చేయడం చిన్నపటి నుంచి అలవాటు అని ఈ సందర్భంగా బుమ్రా పేర్కొన్నాడు. రోహిత్, కోహ్లీ కెప్టెన్సీలో అన్ని విధాల తన శక్తిని ప్రదర్శించినట్లు చెప్పాడు.భారత జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నాడు.
ఇటీవల న్యూజీలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో భారత్ 3-0 తేడాతో ఆ సిరీస్‌ను కోల్పోయింది. అయితే గత ఓటమి గురించి తమ జట్టు ఆలోచిచడం లేదని, కొత్త సిరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు బుమ్రా తెలిపారు. కివీస్‌తో జరిగిన సిరీస్ నుంచి గుణపాఠాలు నేర్చుకున్నామన్నారు. ఇప్పటకే ఆస్ట్రేలియాతో ఆడే తుది జట్టును కూడా ఫైనలైజ్ చేశామని తెలిపిన బుమ్రా కానీ టాస్ సమయంలోనే జట్టు సభ్యుల వివరాలను వెల్లడిస్తామన్నారు.