పది విద్యార్ధులు ఫైనల్ పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థులు చాలా మంది తెలుగులో పరీక్షలు రాయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంగ్లీషులో రాసే సామర్ధ్యం లేకపోవడంతో వారు, తెలుగులో పరీక్షలు రాసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇప్పటికే తెలుగులో పరీక్షలు రాయడానికి ఆప్షన్లు ఇచ్చిన వారు కూడా ఎడిట్ చేసుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఒకేసారి ఇంగ్లీష్ మాధ్యమంలోకి మారుతూ గత ప్రభుత్వం 2021లో నిర్ణయం తీసుకుంది. ఏపీలో పదో తరగతి చదువుతోన్న వారు 6.20 లక్షల మంది విద్యార్ధులు ఉన్నారు. ఇప్పటి వరకు 39 వేల మంది తెలుగులో పరీక్షలు రాస్తామని ఆప్షన్ ఎంచుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలోని అన్నీ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ విద్యార్థులు ఇప్పుడు పదో తరగతిలోకి ప్రవేశించారు. ప్రభుత్వం విద్యార్ధులకు తెలుగు, ఇంగ్లీషులో పుస్తకాలు పంపిణీ చేసింది. ఉపాధ్యాయులు తెలుగులోనే పాఠాలు చెబుతున్నారు. విద్యార్థులు కూడా తెలుగులోనే చదువుకుంటున్నారు. పరీక్షలు కూడా తెలుగులో రాసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పది పరీక్షలు ఇంగ్లీషులో రాయాల్సి రావడం ఇబ్బందిగా ఉందని విద్యార్థుల నుంచి వచ్చిన సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయులకు కూడా ఇంగ్లీష్‌లో బోధన చేసేందుకు వేసవిలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.