విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి మరో రెండు అత్యున్నత పురస్కారాలు లభించాయి. జీ 20 సమావేశాలు ముగించుకుని గయానా, డొమినికా పర్యటనకు వెళ్లిన ప్రధానికి ఆ దేశాల అత్యున్నత పురస్కారాలు అందజేశారు. గయానా అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అందజేశారు.
డొమినికా ప్రధాని సిల్వానీ బర్టన్ డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ పురస్కారంతో ప్రధాని మోదీని సత్కరించారు. కోవిడ్ సమయంలో డొమినికాకు భారత్ వ్యాక్సిన్లు పంపించి ఆదుకుందని ఆ దేశ ప్రధాని సిల్వానీ గుర్తు చేసుకున్నారు. వివిధ దేశాలకు ప్రధాని మోదీ అందించిన సహాయ సహకారాలకుగాను ఈ పురస్కారాలు లభించాయి.
తాజాగా ప్రధాని మోదీకి దక్కిన 3 అత్యున్నత పురస్కారాలతో ఆయన 20 అత్యున్నత పురస్కారాలు పొందిన అతి కొద్ది మంది నాయకుల జాబితాలో చేరారు. గత వారం నైజీరియా ప్రభుత్వం రెండో అత్యున్నత పురస్కారంతో సత్కరించిన సంగతి తెలిసిందే.