కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ ప్రాంతంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. భారతదేశంలోకి అక్రమంగా చొరబడిన ఆ బంగ్లాదేశీయులు మొదట పశ్చిమబెంగాల్‌లో కొంతకాలం ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన ఆరుగురి వ్యక్తుల పేర్లు షేక్ సైఫుర్ రోమన్, మొహమ్మద్ సుమన్ హుసేన్ అలీ, మజహరుల్, అజీజుల్ షేక్, మొహమ్మద్ షేక్ సిక్దర్, సనావర్ హుసేన్.
వాళ్ళు పని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడ్డారని పోలీసులు చెప్పారు. కర్ణాటక వచ్చాక వారు మొదట్లో చాలా చోట్ల తిరిగారు కానీ చివరికి చిత్రదుర్గలో స్థిరపడ్డారు. పోలీసులు వారి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు, ఇతరమైన గుర్తింపు కార్డులూ స్వాధీనం చేసుకున్నారు. అవన్నీ నకిలీవే. వారు బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన వెంటనే వారికి ఈ నకిలీ ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు కార్డులూ కోల్‌కతాలో అందాయని విచారణలో తేలింది. దాన్నిబట్టి, ఈ నకిలీ కార్డుల వెనుక పెద్ద రాకెట్టే ఉందని స్పష్టంగా అర్ధమవుతోంది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.