భారతీయ రిజర్వు బ్యాంక్(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్నికేంద్ర ప్రభుత్వం మరోసారి పొడింగించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి.
ప్రస్తుతం ఆయన పదవీ కాలం వచ్చే నెల డిసెంబర్ 10తో ముగియనుంది. ఈ స్థానం కోసం మరో అభ్యరిని ఇప్పటి వరకూ ఎంపిక చేయలేదు.దీంతో ఆయన పదవీకాలం రెండోసారి పొడిగించే అవకాశం ఉందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత శక్తికాంత దాస్ పదవీకాలం పొడిగింపును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనేని ఆ కథనం సారాంశం.
శక్తికాంత దాస్, 1980వ బ్యాచ్ ఐఏఎస్ అధికారి.2018 డిసెంబర్ 12న ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు ఆర్బీఐ గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ తన పదవీ కాలానికి ముందే రాజీనామా చేశారు. దీంతో కేంద్రం, శక్తికాంత దాస్‌ను నియమించింది. అప్పటి నుంచి ఆయనే పదవిలో కొనసాగుతున్నారు.
2021 డిసెంబర్ 10కి ఆయన ఆర్బీఐ గవర్నర్ పదవి చేపట్టి మూడేళ్ల పదవీ కాలం ముగియడంతో కేంద్ర సర్వీసును పొడిగించింది. మరో మూడేళ్ళపాటు ఆయన ఆ పదవీకాలం పొడిగించారు. డిసెంబర్‌తో ఆయన పదవీ కాలం ముగియనుంది. మరోసారి ఆయన్ని ఆర్బీఐ గవర్నర్‌గా కొనసాగించాలనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం.
బెనగల్ రామారావు అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా సేవలు అందించారు. 1949-1957 మధ్య ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బీఐ చీఫ్ బాధ్యతలు నిర్వర్తించారు. మరోసారి శక్తికాంత దాస్ పదవీకాలం పొడిగిస్తే అత్యధిక కాలం ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేసిన వ్యక్తిగా దాస్ ఘనత సాధిస్తారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
శక్తికాంత దాస్
1980వ బ్యాచ్ఐఏఎస్( తమిళనాడు క్యాడర్ ) అధికారి శక్తికాంత దాస్. 2017 వరకు కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శిగా పని చేశారు. 2016లో నోట్ల రద్దు సమయంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించారు. 8 బడ్జెట్ల రూపకల్పనలో కీలక పాత్ర పోషిచారు.