మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ హత్య కేసులో ఏ8గా ఉన్నశివశంకర్‌రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి అప్రూవర్‌గా మారిన దస్తగిరిని కడప జైల్లోనే బెదిరించారని సునీత తరపు న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా కోర్టుకు వివరించారు. సునీత, వర్రా రాజశేఖర్ రెడ్డి, కేసు విచారించిన సీబీఐ అధికారి రాంసింగ్‌పై ఏపీ పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేయాలని లూథ్రా వాదనలు వినిపించారు.
అప్రూవర్‌గా మారిన వ్యక్తులపై బెదిరింపునకు పాల్పడటంపై సుప్రీంకోర్టు ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేశారు.