ఎయిమ్స్ వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఆగిన గుండెను పనిచేయించారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం. ఈ నెల 16న శుభాకాంత్ సాహు అనే సైనికుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. వైద్యం ప్రారంభించిన తరవాత అతని గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే వైద్యులు సీపీఆర్ నిర్వహించారు. అయినా ఫలితం దక్కలేదు. వైద్యుల బృందం రోగికి క్రిటికల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే 40 నిమిషాలపాటు ఈసీపీఆర్ నిర్వహించారు. గుండె కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే లయ సరిగా లేకపోవడంతో ఎక్మో నిర్వహించారు.
తాజాగా 24 ఏళ్ల సైనికుడు శుభాకాంత్ సాహు కోలుకుంటున్నారు. 96 గంటల తరవాత ఎక్మోను తొలగించారు. ఇలాంటి అరుదైన చికిత్స అందించి ఎయిమ్స్ వైద్యులు ఆగిన గుండెకు ప్రాణం పోశారు. త్వరలో శుభాకాంత్ సాహు పూర్తిగా కొలుకుంటాడని డాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గుండె ఆగిపోయిన 90 నిమిషాల తరవాత మరలా పని చేయడం ఇదే మొదటి సారని వైద్యులు తెలిపారు.