వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై టెక్కలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ జనసేన నేత కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై భూతులతో రెచ్చిపోయాడంటూ వీడియోలతో సహా జనసేన నేతలు ఫిర్యాదు చేశారు.
టెక్కలి జనసేన ఇంఛార్జి కణితె కిరణ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జనసేన నేతలు డిమాండ్ చేశారు.
వైసీపీ సోషల్ మీడియాపై కూటమి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్, కడపకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి, అశోక్ రెడ్డి, హరినాథరెడ్డి, సుధారెడ్డిని అరెస్ట్ చేశారు. శ్రీరెడ్డిపై కేసులు నమోదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడు సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బంధువు అర్జున్ రెడ్డి పరారీలో ఉన్నారు.