తిరుమలలో అన్యమత ప్రచారంపై కేసు నమోదైంది.తిరుమల పాపవినాశనం సమీపంలోని రెండు హాటళ్ల మధ్య కొందరు చిరు వ్యాపారులు అన్యమత ప్రచారం చేయడాన్ని గుర్తించిన భక్తులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు చర్యలకు ఆదేశించారు. భక్తుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు శంకరమ్మ, మీనాక్షి అనే ఇద్దరు చిరు వ్యాపారులను గుర్తించి తిరుపతి తరలించారు.
తిరుపతిలో శంకరమ్మ, మీనాక్షిపై కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద అన్యమత ప్రచారం చేస్తూ రీల్స్ చేసిన వారిపై కేసు నమోదు చేసి, పోలీసులు విచారణ చేపట్టారు. తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.