Friday, May 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి

Home వినోదం

భయంకరమైన విద్వేష నేరానికి నిష్పాక్షిక చలనచిత్ర రూపం ‘ది సబర్మతి రిపోర్ట్’

Phaneendra by Phaneendra
Nov 17, 2024, 04:01 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

ఈమధ్య కొన్నాళ్ళుగా మన దేశంలో సోషియో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఉదాహరణకి ఆర్టికల్ 370, బస్తర్ ది నక్సల్ స్టోరీ, ది వ్యాక్సిన్ వార్, శామ్ బహాదుర్ వంటి సినిమాలు. వాటిని చూస్తుంటే ఏ పాత్ర ఎవరిది అని పోల్చుకోడానికి ప్రేక్షకుడు ప్రయత్నిస్తాడు. దానివల్ల సినిమా కాస్తా డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. అయితే ‘ది సబర్మతి రిపోర్ట్’ చూస్తుంటే అలా అనిపించదు. ఆ సినిమాలో ఏ పాత్ర నిజజీవితంలో ఎవరిని చూపిస్తోంది అని ప్రేక్షకులు ఆలోచించరు. ‘ది సబర్మతి రిపోర్ట్’ అక్కడే సగం గెలిచేసింది.

2002లో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ను గుజరాత్‌లోని గోద్రా దగ్గర తగులబెట్టేసిన కేసు గురించి తెలియని ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చూస్తుంటే అయోమయంగా అనిపించదు. ఆనాటి సంఘటన గురించి తెలుసుకుని మాత్రమే సినిమాకు వెళ్ళాలని ప్రేక్షకులను ఈ సినిమా బలవంతపెట్టదు. ఆ అంశమే, ఇటీవల వస్తున్న సోషియో పొలిటికల్ సినిమాల వరుస నుంచి ఈ సబర్మతి రిపోర్ట్‌ను ప్రత్యేకంగా చూపిస్తుంది.

ఈ సినిమాలో ప్రధాన పాత్రధారిగా విక్రాంత్ మాసేను తీసుకోవడం తెలివైన నిర్ణయం. ఇటీవల యువతరంలో మంచి ప్రజాదరణ పొందుతున్న నటుడు విక్రాంత్. ఈ సినిమా అతని నటనా ప్రతిభకూ నిదర్శనంగా నిలిచింది.

అత్యంత సున్నితమైన గోద్రా రైలు దహనం అంశాన్ని నిష్పాక్షికంగా చూపించడం ఈ చిత్రంలో విశేషం. ముందస్తు ప్రణాళికతో చేసిన ఆ దాడిని, మతవిద్వేషంతో పాల్పడిన నేరాన్ని భయంకరంగా చూపే క్రమంలో మొత్తం ముస్లిం సమాజాన్ని రాక్షసులుగా చిత్రీకరించే ప్రమాదముంది. కానీ చిత్రదర్శకుడు ఆ ట్రాప్‌లో పడలేదు. సినిమాలో, కుట్రదారులకు సహకరించిన ముస్లిములను చూపిస్తూనే, దానికి వ్యతిరేకంగా నిలిచిన ముస్లిములను కూడా చూపించారు. మెహరున్నీసా పాత్ర ఆ సినిమాలో ఒక పెద్ద ఉపశమనం అనే చెప్పవచ్చు.

ఇలాంటి సినిమాల్లో పెద్ద సమస్య ఏంటంటే నిజంగా జరిగిన సంఘటనలను వాస్తవికంగా చిత్రించి చూపించేటప్పుడు ప్రేక్షకుడు చాలా ఇబ్బందికి గురవుతాడు. అలాంటి అసౌకర్యంతో పాటే కొంత ఉపశమనం కూడా కలిగించగలగడమే నిజమైన సవాల్. ఆ విషయంలో ‘ది సబర్మతి రిపోర్ట్’ విజయం సాధించిందనే చెప్పాలి.

ఇక్కడ ఒక విషయం తప్పకుండా చెప్పుకోవాలి. మార్క్సిస్టు ఫిలింమేకర్లు ఇటువంటి విషయాలపై సినిమాలు తీసారు. అయితే ప్రేక్షకుడికి సమస్యాత్మక విషయాలపై సినిమాల్లో ఉపశమనం కలిగించే ప్రయత్నం చేయరు. పైపెచ్చు ముస్లిములు పాల్పడే విద్వేష నేరాలను సమర్ధిస్తూ, నిజంగా జరిగిన ఘటనను మార్చి చెబుతూ తమ సొంత ఊహలను ప్రేక్షకుల మీద రుద్దుతారు. అయితే ‘ది సబర్మతి రిపోర్ట్’ అలా చేయలేదు. నేరాన్ని ఎక్కడా సమర్ధించలేదు. అదే సమయంలో దాన్ని ప్రేక్షకుడు తట్టుకోలేనంత భయంకరంగానూ చూపించలేదు. సరైన జర్నలిస్టిక్ అప్రోచ్‌తో దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అంతే ప్రాధాన్యం ఇస్తూ చూపించారు.

గోద్రాలో రైలులో తగులబడి కాలిపోయిన శవాల నిజమైన దృశ్యాలు భారతీయ మీడియా దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో తీసిన దృశ్యాల కంటె అవే భయంకరంగా ఉంటాయి. అవి ప్రేక్షకుడి మనసును తీవ్రంగా కలచివేస్తాయి. అందుకే ఆ వాస్తవ దృశ్యాల్లోని కొద్దిభాగాలను మాత్రం ఉపయోగించారు. ఆ విషయంలోనూ, ఉన్నంతలో వీలైనంత తక్కువ భయానకంగా ఉండే దృశ్యాలనే, అవికూడా కొన్ని క్షణాలు మాత్రమే వాడారు.

ఈ సినిమాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ దహనాన్ని ఒక మౌలానా చేసిన మతపరమైన దుస్సాహసంగా చూపించారు. దుష్టబుద్ధి కలిగిన పొరుగుదేశం ప్రమేయంతో భారతదేశంలో రెండు మతాల ప్రజల మధ్య సామరస్యాన్ని చెడగొట్టడానికి ఆ మౌలానా తన మాటలు వినే సామాన్య ముస్లిములను రెచ్చగొట్టి, అలాంటి భయంకరమైన విద్వేష నేరానికి వారిని పురిగొల్పాడని చూపించారు. ఆ కేసుకు సంబంధించి ఏ విషయంలోనూ మౌలానా బాధ్యతను చట్టం రూపించలేకపోయింది. కానీ సాధారణ ముస్లిం నేరస్తులు మాత్రం చట్టం గుప్పెట్లోనుంచి తప్పించుకోలేకపోయారు, తమ నేరాలకు శిక్షలు అనుభవించారు.

విక్రాంత్ మాసే పాత్ర ఈ సినిమాలో ఒకచోట వివాదాస్పద మౌలానాతో, ‘ఏదో ఒకరోజు ఈ ముస్లిం మూకలే నీమీద దాడి చేస్తాయి’ అనే ఒక మాట అంటుంది. సాధారణ ముస్లిముల ఆస్తులు మౌలానాల గుప్పిట్లోనుంచి బైటపడే వరకూ అలాంటి రోజు వచ్చే అవకాశమే లేదు. మౌలానాలు ప్రతీయేటా ఒక్కో ముస్లిం సంపాదించిన ఆస్తిలో పది శాతం వాటాను జకాత్ పేరుతో వసూలు చేస్తారట. అంటే ఒక సాధారణ ముస్లిం సంపాదించుకున్న ఆస్తి పదేళ్ళలో అతని మసీదు, అతని మౌలానా పరమవుతుందన్నమాట. అందుకే ఓట్ల విషయంలో కావచ్చు, మరే విషయంలో అయినా కావచ్చు, సాధారణ ముస్లిములు మౌలానాల చేతిలో తోలుబొమ్మల్లా ఆడుతుంటారు.

సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే, నిజంగా జరిగిన ఒక భయంకరమైన మతవిద్వేష నేరాన్ని నిష్పాక్షికంగా ఏ మతానికీ సంబంధం లేకుండా చూపించిన చలనచిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’.

Tags: 2002 Godhra Riotsandhra today newsFilm ReviewSLIDERThe Sabarmati ReportTOP NEWSVikram Masse
ShareTweetSendShare

Related News

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు
general

పాకిస్థాన్ నటుల సినిమాల నిషేధంపై నటుడు ప్రకాశ్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు
general

విశాఖ రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసు

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్
Entertainment

రామ్ చరణ్ నటిస్తోన్న పెద్ది ఫస్ట్ షాట్ గ్లింప్స్

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం
Latest News

శబరిమల గుడిలో మమ్ముట్టి పేరుమీద మోహన్‌లాల్ పూజలు, ముస్లిముల ఆగ్రహం

జాట్ మూవీ ట్రైలర్
Entertainment

జాట్ మూవీ ట్రైలర్

Latest News

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

ఆపరేషన్ సిందూర్‌లో వందమందికి పైగా ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్ సింగ్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

పాకిస్థాన్‌ గగనతల రక్షణ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత్

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

భారత వ్యతిరేక ప్రచారంపై ఉక్కుపాదం : రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

ఆపరేషన్ సిందూర్: పాకిస్తాన్ కకావికలం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

పాక్ సరిహద్దులు సీజ్ : అనుమానాస్పద వ్యక్తులను కాల్చిపడేయాలని ఆదేశం

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

లాహోర్‌లో పేలుళ్లు : విమానాశ్రయం మూసివేత

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

మందుపాతర పేలుడులో ముగ్గురు పోలీసులు మృతి

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ : మీడియా తప్పుడు కథనాల వివాదాలు

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

ఆపరేషన్ సిందూర్ గురించి వివరించిన ఆ ఇద్దరు మహిళలు ఎవరు?

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.