గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరుకు చెందిన కాపర్తి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలిస్తున్నప్పుడు టీడీపీ, జనసేన నాయకులు కార్యకర్తలు నిరసనకు దిగారు. వీరిపై మేయర్ మనోహర్‌నాయుడు కర్రతో దాడికి దిగాడు. అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు.
తాజాగా శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడి చేయడంతోపాటు, చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.