పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ఇంటిపై దాడి చేయడంతో సైన్యం అప్రమత్తమైంది. ఉత్తర ఇజ్రాయెల్ సిజేరియా పట్టణంలోని నెతన్యాహు ఇంటిపై ఉగ్రవాదులు బాంబు దాడులు చేశారు. బాంబులు నెతన్యాహు ఇంటి ఆవరణలో పడటంతో ప్రమాదం తప్పింది. బాంబు దాడులు జరిగిన సమయంలో నెతన్యాహు అక్కడ లేకపోవడంతో సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
నెతన్యాహు ఇంటిపై దాడిపై ఇజ్రాయెల్ సైన్యాధికారులు స్పందించారు. దీనిపై విచారణ చేయాలని న్యాయశాఖను ఆదేశించారు. గత నెలలో కూడా నెతన్యాహు లక్ష్యంగా ఇంటిపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులు చేశారు. ఆ సమయంలో కారు ధ్వంసమైంది.
తాజాగా నెతన్యాహు ఇంటిపై దాడులపై రక్షణ మంత్రి తీవ్ర హెచ్చరికలు చేశారు. దాడికి ప్రతిదాడులు ఇంటాయని హెచ్చరించారు. దాడులకు పాల్పడింది ఎవరనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ కూడా తామే దాడులకు దిగామని ఇంకా ప్రకటించుకోలేదు.