భారత రక్షణ రంగం మరోఘనత సాధించింది. తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు.ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని చివరి వరకు చాలా రహస్యంగా ఉంచారు. హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమయ్యాక మీడియాకు వెల్లడించారు. ఇది ముందే నిర్దేశించిన లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో ఛేదించినట్లు రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో హైపర్ సోనిక్ క్షిపణులు కలిగిన మూడు అగ్రదేశాల జాబితాలో భారత్ చేరినట్లైంది.
ఏమిటీ హైపర్ సోనిక్ క్షిపణి ప్రత్యేకత?
సూపర్ సోనిక్ క్షిపణులు మూడు దశాబ్దాల కిందటే వచ్చాయి. ఇవి ధ్వని వేగం కన్నా స్పీడుగా లక్ష్యాన్ని చేరుకుంటాయి. ఇక తాజాగా రూపొందించి ప్రయోగించిన హైపర్ సోనిక్ క్షిపణి ధ్వని వేగం కన్నా 25 రెట్లు ఎక్కువ వేగంతో లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
అంటే సెకనుకు 5 మైళ్ల దూరం ప్రయాణం చేయడం దీని ప్రత్యేకత. ఇలాంటి క్షిపణులు ప్రపంచంలో కేవలం రెండు అగ్రదేశాల వద్ద మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.
హైపర్ సోనిక్ క్షిపణి 1500 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వివిధ రకాల వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. దీన్ని ఒడిషాలోని ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు. హైదరాబాద్ డీఆర్డీఓ ఈ క్షిపణిని రూపొందించింది. దీని తయారీలో దాదాపు 200 సంస్థలు పొల్గొన్నాయి. అంత్యంత ఖచ్ఛితత్వంతో లక్ష్యాన్ని ఢీకొట్టిందని రక్షణ మంత్రి ఎక్స్ వేదికలో పోస్ట్ చేశారు.